ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ముందు ఓ యువకుడు ఆత్మాహుతికి యత్నించడం కలకలం రేపింది. ఉద్యోగం ఇప్పించాలని సీఎంకు విన్నవించేందుకు వెళ్లిన యువకుడు.. భద్రతా సిబ్బంది అడ్డుకోవడం వల్ల నిప్పంటించుకున్నాడు. వెంటనే దుప్పట్లు, నీళ్లతో మంటలను ఆర్పారు అక్కడున్న సిబ్బంది. అనంతరం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడని సమాచారం.
నిరుద్యోగమే కారణం..
దంతరీ ప్రాంత వాసియైన హర్దేవ్ 12వ తరగతి చదివి ఖాళీగా ఉంటూ.. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడు ముఖ్యమంత్రిని కలిసి ఉద్యోగం కోరాలని అనుకున్నట్లు తెలిసింది.
ఇదీ చూడండి: 'తబ్లీగీలను నిషేధించడంపై కేంద్రం వైఖరేంటి?