ETV Bharat / bharat

వ్యవసాయ పనుల్లో రైతన్నకు అండగా 'ఫైబర్ నిచ్చెన' - ఫైబర్​ లాడర్​

దేశానికి వ్యవసాయం వెన్నెముక లాంటింది. అంతటి ప్రాధాన్యం ఉన్న వ్యవసాయరంగానికి.. నేటి ఆధునిక కాలంలో ఆదరణ కరవైంది. కూలీలు అందుబాటులో లేక రైతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ తరుణంలో అన్నదాతకు పలు రకాలుగా ఉపయోగపడేలా కొత్తరకం నిచ్చెనను రూపొందించాడు ఓ యువకుడు. ఏంటీ ఆ నిచ్చెన? ఎవరా యువకుడు?

Young boy invented Fiber ladder which is helpful for agriculture
వ్యవసాయ పనుల్లో రైతుకు సాయపడేలా 'ఫైబర్ నిచ్చెన'
author img

By

Published : Jul 5, 2020, 12:43 PM IST

లాక్​డౌన్​ కారణంగా.. వ్యవసాయ రంగంలో కూలీలు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో రైతులకు పొలం పనుల్లో పలురకాలుగా ఉపయోగపడేలా.. ఫైబర్(నార) నిచ్చెనను తయారు చేశాడు కర్ణాటకవాసి దయానంద్​.

కొబ్బరి, పోకచెక్క లాంటి పెద్ద పెద్ద చెట్లను సైతం అలవోకగా ఎక్కేవిధంగా ఈ నిచ్చెనను రూపొందించాడు ఆ యువకుడు. చెట్లతో పాటు విద్యుత్​ స్తంభాలను ఎక్కడానికీ ఇది సాయపడుతుంది. మంగళూరు విద్యుత్​ సరఫరా కంపెనీ(మెస్కామ్​) కార్మికులు ప్రయోగాత్మకంగా ఈ ఫైబర్​ నిచ్చెనను ఉపయోగించారు. నారతో తయారైనందున కరెంట్​ ​షాక్​ నుంచి కూడా ఇది రక్షణ కల్పిస్తుందని విద్యుత్​ కార్మికులు అంటున్నారు.

వ్యవసాయ పనుల్లో రైతుకు సాయపడేలా 'ఫైబర్ నిచ్చెన'

20 కేజీల లోపే..

ఇలా బహుళ విధాలుగా ఉపయోగపడేందుకు తక్కువ బరువులోనే మూడు రకాల నిచ్చెనలను తయారుచేశాడు దయానంద్​. 5, 10, 20 అడుగులలో విభిన్న రకాలుగా ఈ నిచ్చెనలు ఉంటాయి. ఒక్కోదాని బరువు కేవలం 20 కేజీలలోపు ఉండటం వల్ల.. సులభంగా ఒకచోటు నుంచి మరోచోటుకి వీటిని తీసుకెళ్లవచ్చు.

లాక్​డౌన్​ తెచ్చిన ఆలోచన..

శాస్త్ర సాంకేతికత వృద్ధి చెందుతోన్న నేటి తరంలో అల్యూమినియం నిచ్చెనలకు భారీగా డిమాండ్​ పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఫైబర్​ నిచ్చెన ఆలోచన వచ్చిందంటున్నాడు దయానంద్​.

'లాక్​డౌన్​ కాలంలో ఫైబర్​ నిచ్చెనను రూపొందించాలనే ఆలోచన వచ్చింది. అందుకు అనుగుణంగానే దీనిని తయారు చేశాం. ఇప్పటికే ఇది మార్కెట్​లోకి అందుబాటులోకి వచ్చింది. రైతులకు, విద్యుత్​ కార్మికులకు బహుళ విధాలుగా ఉపయోగపడుతున్నందున ఈ నిచ్చెనకు డిమాండ్​ పెరిగింది.'

- దయానంద్​,​ నిచ్చెన రూపొందించిన వ్యక్తి.

ఇదీ చదవండి: ఆ ఉపాధ్యాయుల నుంచి 13 కోట్లు వసూలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.