ETV Bharat / bharat

ఈ ఏడాది ఇంట్లోనే యోగా దినోత్సవం: మోదీ - Prime Minister Narendra Modi

కరోనా వైరస్​తో ఎదురయ్యే సవాళ్లకు యోగా పలు పరిష్కారాలు చూపుతుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. యోగా దినోత్సవాన్ని ప్రజలు ఇంట్లోనే జరుపుకోవాలని పిలుపునిస్తూ.. ఈ ఏడాదికి 'ఇంట్లోనే యోగా, కుటుంబంతో యోగా' అని నినదించారు. ఈ సంవత్సరం యోగా దినోత్సవంలో ప్రధాని సందేశం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుందని పేర్కొంది ఆయూష్​ మంత్రిత్వ శాఖ.

observe Yoga Day at home: PM
ఈ ఏడాది ఇంట్లోనే యోగా దినోత్సవం: మోదీ
author img

By

Published : Jun 19, 2020, 5:16 AM IST

కొవిడ్​-19 మహమ్మారితో ఎదురయ్యే సవాళ్లకు యోగా పలు పరిష్కారాలు చూపుతుందని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈనెల 21న 6వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భాన్ని పురష్కరించుకుని ప్రజలకు పలు సూచనలు చేశారు మోదీ. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా యోగా దినోత్సవాన్ని తమ తమ ఇళ్లల్లోనే జరుపుకోవాలని కోరారు. ప్రజల కదలికలను వైరస్​ తగ్గించొచ్చు కానీ, యోగాలో పాల్గొనాలనే ఉత్సాహంపై ప్రభావం చూపలేదని పేర్కొన్నారు.

" ప్రస్తుతం భౌతిక దూరం పాటించాల్సిన సమయం. కానీ, యోగా అంటే దూరాన్ని తగ్గిస్తుందని మీకు తెలుసా? యోగా అంటే అందరిని కలుపుతుంది. మన జీవితానికి, మనం కోరుకునే జీవితానికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా యోగా సాధన చేయటం వల్ల మానసికంగా బలం చేకూరుతుంది."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

'ఇంట్లోనే యోగా, కుటుంబంతోనే యోగా'

కరోనా కోరలు చాస్తున్నందున ప్రపంచం మొత్తం వైరస్​ నియంత్రణపైనే దృష్టి సారించిందన్నారు మోదీ. ప్రస్తుత పరిస్థితుల్లో యోగా మరింత ప్రాచుర్యం పొందుతుందనే నమ్మకం ఉందన్నారు. ఈ ఏడాదికి 'ఇంట్లోనేే యోగా, కుటుంబంతోనే యోగా' అని నినదించారు. భౌతికదూరం నియమాలను పాటిస్తూ కుటుంబ సభ్యులతోనే యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు.

ప్రత్యేక ఆకర్షణగా ప్రధాని సందేశం..

ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ సందేశం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుందని పేర్కొంది ఆయూష్​ మంత్రిత్వ శాఖ. భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడటాన్ని నిరోధించేందుకు ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని డిజిటల్​ వేదికగా నిర్వహిస్తున్నట్లు తెలిపింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తక్కువ సంఖ్యలో వేడుకలు నిర్వహిస్తూ.. ఎక్కువ మంది భాగస్వాములయ్యేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించింది మంత్రిత్వ శాఖ. ప్రజలు వారి వారి ఇళ్లల్లోనే యోగా నిర్వహించుకోవాలని సూచించింది. ప్రధాని సందేశం ఆ రోజు ఉదయం 6:30 గంటలకు ప్రసారమవుతుందని తెలిపింది.

ఇదీ చూడండి: ఐరాస భద్రతా మండలిలో భారత్ అజెండా ఇదేనా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.