ETV Bharat / bharat

కరోనా కాలంలో 'యోగా డే' కోసం కేంద్రం కొత్త ప్లాన్ - 2020 yoga day celebrations

కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నందున.. ఈ ఏడాది యోగా డే వేడుకలను డిజిటల్​ ప్లాట్​ఫాం వేదికగా నిర్వహించనుంది కేంద్రం. ఈ నేపథ్యంలోనే ఇటీవల 'మై లైఫ్...​ మై యోగా' పేరుతో వీడియో బ్లాగింగ్​ పోటీని ప్రారంభించారు ప్రధాని.

Yoga Day to be celebrated on digital media platforms this year
డిజిటల్​ ప్లాట్​ఫాం వేదికగా 'యోగా డే'
author img

By

Published : Jun 6, 2020, 7:45 AM IST

కరోనా భయాందోళనల నడుమ ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని డిజిటల్​ ప్లాట్​ఫాం వేదికగా నిర్వహించనున్నట్లు కేంద్రం తెలిపింది. పెద్ద సంఖ్యలో గుమిగూడే కార్యక్రమాలేవీ చేయకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

ఈ ఏడాది 'ఇంట్లోనే యోగా.. కుటుంబంతో యోగా' నినాదంతో జూన్​ 21 ఉదయం 7 గంటలకు.. వర్చువల్​ పద్దతిలో యోగా డే వేడుకలు జరుపుకోవాలని అధికారులు సూచించారు. విదేశాల్లో ఉన్న భారతీయ మిషన్లు.. డిజిటల్​ మీడియా, యోగాకు మద్దతు ఇచ్చే సంస్థల నెటవర్క్ ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

లద్దాక్​లోని లేహ్​ ప్రాంతంలో 'యోగా డే'ని గొప్పగా నిర్వహించాలని గతంలో ఆయుష్​ మంత్రిత్వ శాఖ ప్రణాళిక రచించింది. ఈ వేడుకకు ప్రధాని మోదీ హాజరు కావాల్సి ఉంది. అయితే మహమ్మారి కారణంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారు.

Yoga Day to be celebrated on digital media platforms this year
వర్చువల్​ యోగా

పోటీల్లో పాల్గొనాలంటే...

యోగాపై అవగాహన పెంచేందుకు 'మై లైఫ్...​ మై యోగా' పేరుతో మే 31న వీడియో బ్లాగింగ్​ పోటీని ప్రారంభించారు ప్రధాని. పోటీలో పాల్గొనేవారు 3 నిమిషాల పాటు (క్రియ, ప్రాణాయామం, ముద్ర) ఆసనాలు వేసి వీడియోను అప్​లోడ్​ చేయాలి. ఈ ఆసనాలు వారి జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయో ఓ చిన్న విశ్లేషణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ పోటీని రెండు విధాలుగా నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీల్లో మొదట జాతీయ స్థాయిలో విజేతలను ఎంపిక చేస్తారు. అనంతరం ప్రపంచ స్థాయిలో వివిధ దేశాల నుంచి ఎంపికైన వారిలో విజేతను ప్రకటిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.