రెండో అనధికారిక సదస్సు సందర్భంగా భారత్, చైనా దేశాధినేతలు... మహాబలిపురంలోని సముద్ర ముఖంవైపు ఉన్న షోర్ ఆలయాన్ని సందర్శించారు. యూనెస్కో వారసత్వ సంపదగా గుర్తించిన ఈ ఆలయంలో ప్రధాని మోదీ, చైనా అధినేత షి జిన్‌పింగ్ కలియతిరిగారు.
మొదట ఆలయానికి చేరుకున్న ఇద్దరు నేతలకు ఆహ్వానం పలికారు భారత విదేశాంగ మంత్రి జయ్శంకర్, భద్రతా సలహాదారు అజిత్ డోభాల్. ప్రముఖుల సందర్శన నేపథ్యంలో ఆలయాన్ని ఎల్ఈడీ దీపాలతో అలంకరించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇద్దరు దేశాధినేతలు వీక్షించారు.
అంతకుముందు అర్జున పెనాన్స్, పంచ రథాలను దర్శించారు.
ఇదీ చూడండి: జిన్‌పింగ్‌కు స్వాగతం పలికిన ప్రధాని మోదీ