ETV Bharat / bharat

ప్రభుత్వ ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి రెజ్లర్​ బబిత! - Baroda Assembly bypoll BJP Candidate Babita

ప్రముఖ రెజ్లర్​ బబితా ఫొగాట్ పూర్తిస్థాయిలో​ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్టు తెలుస్తోంది. హరియాణా క్రీడా విభాగంలో డిప్యూటీ డైరెక్టర్​గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె.. ఉద్యోగానికి రాజీనామా చేశారు. హరియాణాలోని బరోడా అసెంబ్లీ ఉప ఎన్నికకు భాజపా తరఫున ఆమె పోటీ చేసే అవకాశముంది.

Wrestler Babita Phogat quits govt job to join politics
ప్రభుత్వ ఉద్యోగం వదిలి రాజకీయాల్లో చేరనున్న రెజ్లర్​ బబిత
author img

By

Published : Oct 7, 2020, 7:00 PM IST

ప్రముఖ రెజ్లర్​, 2014 కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత బబితా ఫొగాట్​ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. హరియాణా క్రీడా విభాగం డిప్యూటీ డైరెక్టర్​ పదవికి అనివార్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ఆమె లేఖలో పేర్కొన్నారు

రాజకీయాల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకే బబిత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సొంత రాష్ట్రం హరియాణాలోని బరోడా అసెంబ్లీ ఉపఎన్నికకు భాజపా తరఫున ఆమె బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బరోడా ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని రాజీనామా అనంతరం మీడియా సమావేశంలో వెల్లడించారు బబిత.

2019లో తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బబిత.. దాద్రి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు.

ఇదీ చదవండి: బిహార్​ బరి: సీట్ల లెక్కలు పూర్తి- గెలుపుపైనే గురి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.