ETV Bharat / bharat

అందాల 'గన్​హిల్'..​ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా? - గన్​హిల్స్​ మసూరీ ఉత్తరాఖండ్​

మసూరీ.... పర్వతరాణిగా విశ్వవిఖ్యాతి గాంచిన ఓ సుందరమైన ప్రాంతం. అయితే... ఇక్కడ ఆశ్చర్యం కలిగించే మరెన్నో చారిత్రక స్థలాలూ ఉన్నాయి. వాటిలో గన్‌హిల్ ఒకటి. స్వతంత్రానికి ముందు నుంచే ప్రముఖ పర్యటక కేంద్రంగా అవతరించింది గన్‌హిల్. మసూరీ అభివృద్ధి కోసం ఆనాటి బ్రిటిష్‌ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. ఈ ప్రాంతం గురించి ఆశ్చర్యం కలిగించే అంశం ఒకటుంది. ప్రజలకు సమయం తెలిపేందుకు ఈ కొండ మీద నుంచి ఫిరంగులు పేల్చేవారట. అలా గన్‌హిల్ అనే పేరొచ్చిందని స్థానికులు చెప్తారు.

world famous gunhills in masuri uttharakhand
అందాల 'గన్​హిల్'..​ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
author img

By

Published : Sep 4, 2020, 7:45 PM IST

అందాల 'గన్​హిల్'..​ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

మసూరీ ప్రపంచప్రఖ్యాతి గాంచిన ఓ సుందరమైన పర్యటక ప్రదేశం. అలాంటి ప్రాంతానికే ప్రత్యేకత తెచ్చిపెట్టే గన్‌హిల్ పైన ఇప్పుడున్నాం. ఇక్కడి నుంచి నగరం మొత్తం సుందరంగా కనిపిస్తుంది. ఈ కొండ గురించి ఆశ్చర్యకరమైన మరో విషయం ఉంది. గడియారాలు లేని కాలంలో రోజూ మధ్యాహ్నం ఈ కొండపై ఫిరంగులు పేల్చేవారట. అలా సరిగ్గా మధ్యాహ్నం అయిందని ప్రజలు గుర్తించేవారట.

ధనవంతులు మాత్రమే గడియారాలు కొనుక్కోగలిగిన రోజుల నాటి మాట ఇది. నగరంలోని చాలా కొద్ది మంది ప్రముఖుల వద్ద మాత్రమే గడియారాలుండేవి. ఆ గడియారాల్లో సమయం సెట్ చేసుకునేందుకు....బ్రిటిషర్లు ఓ వింత పద్ధతిని పాటించేవారు. నగరం నడిబొడ్డున ఉండే ఓ కొండ మీద నుంచి, గంటగంటకూ....గుండ్లు పేల్చేవారు. ఎన్నిసార్లు గుండ్లు పేలితే అన్ని గంటల సమయం అయినట్లు లెక్క. ఓసారి గుండు బ్రిటిష్ మహిళపై పడడం వల్ల....నగరంలో గందరగోళం నెలకొంది. అనుకోని ఈ ఘటన జరిగిన తర్వాత ఈ పద్ధతికి ఫుల్‌స్టాప్ పడింది.

"వాళ్లు పేల్చే ఫిరంగుల్లో పేలుడుపదార్థాలు ఏమీ ఉండేవి కావు. శబ్ధం కోసమే ఆ పద్ధతి వినియోగించేవారు. ఓసారి రిక్షాలో వెళ్తున్న బ్రిటిష్ మహిళ మీద ఈ గుండు పడినప్పటి నుంచి ఫిరంగులు పేల్చడం ఆపేశారు. ఆమెలాగే ఎవరికైనా ప్రమాదం జరుగుతుందేమో అని ఈ పద్ధతిని విడిచిపెట్టారు."

- గణేష్ శెల్లీ, రచయిత

ప్రస్తుతం అక్కడ ఫిరంగి లేకపోయినా...ఈ కొండకు గన్‌హిల్ అన్న పేరే స్థిరపడిపోయింది. కానీ... ఈ కొండ, దానివెనక ఉన్న చరిత్ర గురించి, ప్రజలు క్రమంగా మర్చిపోతుండడం విచారకర అంశం. సహజ అందాలతో పాటు, చారిత్రక వైభవం కలిగి ఉన్న ఇలాంటి ప్రాంతాలను సంరక్షించడంపై ప్రభుత్వాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.