దేశంలో సురక్షితమైన జాతీయ రహదారులను నిర్మించి.. వాటిని పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు ప్రపంచ బ్యాంక్- భారత ప్రభుత్వం మధ్య రూ. 36వేల కోట్ల ఒప్పందం కుదురింది. రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లో ఈ హైవే కారిడార్లను అభివృద్ధి చేయనున్నట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ తెలిపింది.
"రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సురక్షితమైన, పచ్చదనంతో కూడిన జాతీయ రహదారి కారిడార్లు నిర్మించడానికి కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు 36వేల కోట్ల విలువగల ప్రాజెక్టుపై భారత ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్ సంతకాలు చేశాయి."
-రోడ్డు రవాణా- రహదారుల మంత్రిత్వ శాఖ.
ఈ ఒప్పందంతో 783 కిలోమీటర్ల మేర పర్యావరణహిత కారిడార్లను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుతో దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తరణ పనులు చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. అనుసంధానాన్ని మెరుగుపరచడం వల్ల ఆర్థికాభివృద్ధి సాధించివచ్చని కేంద్రం భావిస్తోంది.