కేరళ కాసరగోడ్ జిల్లా పూదమ్‌కల్లుకు చెందిన గోపాలన్ తన ఇంటి ప్రాంగణంలో ఉన్న చెట్ల కొమ్మలు, వేర్లతో బొమ్మలను అద్భుతమైన బొమ్మలను తయారు చేస్తూ భళా అనిపించుకుంటున్నాడు. టేకు, పనస, ఎర్రకలప మొక్కలతో వివిధ ఆకృతుల్లో కళాఖండాలు సృష్టిస్తున్నాడు.
తాబేలు, ఏనుగు, కొంగ, చేపలు ఇలా రకరకాల జంతువులు, పక్షుల బొమ్మలను తీర్చిదిద్దుతున్నాడు. దేవుళ్లు, రాజకీయ నాయకుల చిత్రాలనూ చెక్కుతున్నాడు.
అతడి కళాకృతులు.. ఎందరినో మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. మొదట ఈ పని.. సరదాగా ప్రారంభించినప్పటికీ క్రమంగా అది తన అభిరుచిగా మారినట్లు గోపాలన్ చెబుతున్నాడు. ఇప్పుడదే జీవితంగా బతుకుతున్నట్లు తెలిపాడు.