మహిళల భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. యూపీలో మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే వారిని నాశనం చేయటం అనివార్యమంటూ ట్వీట్ చేశారు.
-
उत्तर प्रदेश में माताओं-बहनों के सम्मान-स्वाभिमान को क्षति पहुंचाने का विचार मात्र रखने वालों का समूल नाश सुनिश्चित है।
— Yogi Adityanath (@myogiadityanath) October 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
इन्हें ऐसा दंड मिलेगा जो भविष्य में उदाहरण प्रस्तुत करेगा।
आपकी @UPGovt प्रत्येक माता-बहन की सुरक्षा व विकास हेतु संकल्पबद्ध है।
यह हमारा संकल्प है-वचन है।
">उत्तर प्रदेश में माताओं-बहनों के सम्मान-स्वाभिमान को क्षति पहुंचाने का विचार मात्र रखने वालों का समूल नाश सुनिश्चित है।
— Yogi Adityanath (@myogiadityanath) October 2, 2020
इन्हें ऐसा दंड मिलेगा जो भविष्य में उदाहरण प्रस्तुत करेगा।
आपकी @UPGovt प्रत्येक माता-बहन की सुरक्षा व विकास हेतु संकल्पबद्ध है।
यह हमारा संकल्प है-वचन है।उत्तर प्रदेश में माताओं-बहनों के सम्मान-स्वाभिमान को क्षति पहुंचाने का विचार मात्र रखने वालों का समूल नाश सुनिश्चित है।
— Yogi Adityanath (@myogiadityanath) October 2, 2020
इन्हें ऐसा दंड मिलेगा जो भविष्य में उदाहरण प्रस्तुत करेगा।
आपकी @UPGovt प्रत्येक माता-बहन की सुरक्षा व विकास हेतु संकल्पबद्ध है।
यह हमारा संकल्प है-वचन है।
"రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేవారికి గుణపాఠం తప్పదు. వారికి కచ్చితంగా శిక్ష పడుతుంది. ఈ శిక్ష భవిష్యత్ తరాలకు గుర్తుంటుంది. యూపీలోని తల్లులు, కుమార్తెల భద్రత, అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఇదే మా ప్రభుత్వ సంకల్పం."
- యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం
అధికారులపై వేటు..
హాథ్రస్ కేసుకు సంబంధించి ప్రాథమిక విచారణ ఆధారంగా.. జిల్లా ఎస్పీ, డీఎస్పీతో పాటు మరికొంత మంది ప్రభుత్వాధికారులను సస్పెండ్ చేయాలని యోగి ఆదేశించినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. ఈ జాబితాలో కలెక్టర్ ప్రవీన్ కుమార్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
బాధితురాలి కుటుంబాన్ని బెదిరించారని ప్రవీన్పై ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి గ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నించిన తృణమూల్ నేత, రాజ్యసభ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్పై ప్రవీన్ కుమార్ దురుసుగా ప్రవర్తించినట్టు ఆరోపణలున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
పోలీసుల చర్యలతో అపకీర్తి..
హాథ్రస్ బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు మీడియా, రాజకీయ నాయకులకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు భాజపా సీనియర్ నేత ఉమాభారతి. పోలీసుల చర్యలతో ప్రభుత్వానికి అపవాదు వస్తోందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'హాథ్రస్'పై దద్దరిల్లిన దిల్లీ- నిరసనల్లో కేజ్రీ