ETV Bharat / bharat

ఫోన్​ మాట్లాడుతూ బావిలో పడిన మహిళ.. తర్వాత ఏమైందంటే? - ఫోన్​ మాట్లాడుతూ బావిలో పడిన అమ్మాయి

ఫోన్​ మాట్లాడుతూ పొరపాటున ఓ మహిళ బావిలో పడిపోయిన ఘటన కేరళ మలప్పురంలో జరిగింది. బంధువులు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది సహాయంతో ఆమెను వెలికితీశారు. స్వల్పగాయాలతో ఆమె బయటపడి ఊపిరి పీల్చుకుంది.

Woman slipped and fell into a well while making a phone call
ఫోన్​ మాట్లాడుతూ బావిలో పడిన అమ్మాయి
author img

By

Published : Feb 22, 2020, 10:50 PM IST

Updated : Mar 2, 2020, 5:52 AM IST

ఫోన్​ మాట్లాడుతూ బావిలో పడిన మహిళ.. తర్వాత ఏమైందంటే?

ఓ మహిళ ఫోన్ మాట్లాడుతూ పొరపాటున బావిలో పడిపోయిన ఘటన కేరళ మలప్పురం జిల్లా తిరూర్​లో శుక్రవారం రాత్రి జరిగింది. చివరికి ఆ ఫోను సాయంతో స్వల్పగాయాలతో బయటపడింది.

ఎడకులం గ్రామానికి చెందిన 24 ఏళ్ల ఆ అమ్మాయి తిరూర్​లోని తన బంధువుల ఇంటికి వచ్చింది. సమీపంలోని ఆలయంలో జరుగుతున్న పండుగ వేడుకలను చూడడానికి వెళ్లింది. అయితే అక్కడ జనం ఎక్కువగా ఉండటం వల్ల ఫోన్​ చేయడానికి ఓ నిర్జన ప్రదేశానికి వెళ్లింది. ఫోన్​ మాట్లాడుతూ అనుకోకుండా బావిలో పడిపోయింది.

అదృష్టం బాగుండి ఆమె చేతిలోనే ఫోన్​ ఉండడం కలిసొచ్చింది. తాను బావిలో ప్రమాదవశాత్తు పడిపోయానని బంధువులకు ఫోన్ చేసింది. అప్రమత్తమైన బంధువులు అగ్నిమాపక సిబ్బంది సాయంతో ఆమెను వెలికితీశారు. ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: టెంపో-ట్రక్కు ఢీ.. 12 మంది దుర్మరణం

Last Updated : Mar 2, 2020, 5:52 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.