ETV Bharat / bharat

తల్లడిల్లిన తల్లి హృదయం.. స్కూటీపైనే 1800 కి.మీ! - Woman rides 1800 km on scooty to reach Jamshedpur

కట్టుకున్న భర్త గుండె జబ్బుతో బాధపడుతున్నాడు.. కన్న బిడ్డ అమ్మా ఎప్పుడొస్తావంటూ ఎదురుచూస్తున్నాడు. దీంతో, లాక్ డౌన్ వేళ రాష్ట్రం కాని రాష్ట్రంలో చిక్కుకున్న ఆ తల్లి మనసు తల్లడిల్లింది. తన కుటుంబం దగ్గరికి తనను చేర్చమని ముఖ్యమంత్రి సహా ప్రముఖులను వేడుకుంది. నాలుగు నెలలయినా ఏ సాయం అందకపోయే సరికి ముంబయి నుంచి ఝార్ఖండ్ కు దాదాపు 1800 కి.మీ స్కూటీపై ప్రయాణం చేసి స్వస్థలానికి చేరుకుంది.

woman-rides-1800-km-on-scooty-to-reach-jamshedpur-from-mumbai-amid-lockdown
సాయం అందక.. స్కూటీపైనే 1800 కి.మీ !
author img

By

Published : Jul 26, 2020, 1:49 PM IST

Updated : Jul 26, 2020, 4:21 PM IST

కరోనా మహమ్మారిని అరికట్టడానికి విధించిన లాక్​డౌన్ ఇప్పటికీ ఎందరినో హరిగోసలు పెడుతోంది. ఝార్ఖండ్​లో కుటుంబాన్ని వదిలి ఉద్యోగ రీత్యా ముంబయికు వచ్చిన ఓ మహిళ ఇంటి అద్దె కట్టలేక, తిరిగి సొంతగూటికి వెళ్లే మార్గం లేక ఎనలేని తిప్పలు పడింది. ఆఖరికి తన స్కూటీపైనే 1800 కి.మీ ప్రయాణించి ఇల్లు చేరుకుంది.

ఝార్ఖండ్, జమ్​షెద్​ పుర్, కద్మాకు చెందిన సోనియా దాస్ ముంబయిలోని ఓ ప్రొడక్షన్ హౌస్​లో పని చేస్తోంది. భర్త అభిషేక్ ఘోష్ గుండె సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో ఐదేళ్ల కుమారుడిని చూసుకుంటూ కద్మాలోనే ఉంటున్నాడు.

లాక్​డౌన్ తో షూటింగ్స్ లేక సోనియా ఉపాధి కోల్పోయింది. ఆర్థికంగా పూర్తిగా చితికిపోయింది. అద్దె కట్టలేక ఇంటిని ఖాళీ చేసి, స్నేహితురాలు సబియా ఇంట్లో కొద్ది రోజులు ఆశ్రయం పొందింది. ఇంటికెళ్లిపోదామంటే డబ్బులు లేవు. దీంతో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ప్రముఖ నటుడు సోనూసూద్​లను సాయం కోరుతూ ట్వీట్ చేసింది. కానీ, లాభం లేకపోయింది.

ఇక తన స్కూటీపైనే ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది సోనియా. స్నేహితుల వద్ద రూ.5000 అప్పు తీసుకుంది. జులై 21న స్కూటీపై ఇంటికి బయల్దేరింది. దాదాపు 1800 కి.మీ ప్రయాణించి కద్మాకు చేరుకున్నాక.. బాధ్యతగా తనంతట తానే క్వారంటైన్ కేంద్రంలో చేరింది సోనియా.

ఇదీ చదవండి: పొలంబాటలో ఉపాధి వేట.. యువతకు అవకాశాల వెల్లువ

Last Updated : Jul 26, 2020, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.