ETV Bharat / bharat

భర్త టిక్​టాక్ వద్దన్నాడు.. ఆత్మహత్య పోస్ట్ చేసింది

తమిళనాడులోని శీరన్తమ్​ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. టిక్​-టాక్​ యాప్​కు బానిసగా మారిన ఓ మహిళను భర్త మందలించాడు. పట్టలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆ దృశ్యాలను చిత్రీకరించి అదే యాప్​లో పోస్ట్​ చేసింది.

author img

By

Published : Jun 13, 2019, 10:04 AM IST

Updated : Jun 13, 2019, 1:44 PM IST

ఆత్మహత్యను టిక్​-టాక్​లో రికార్డు చేసిన వివాహిత

ఓ మహిళ తను ఆత్మహత్య చేసుకుంటున్న దృశ్యాలు చిత్రీకరించి టిక్​-టాక్​ యాప్​లో పోస్ట్​ చేసిన ఘటన తమిళనాడులోని పెరంబలూర్​ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో టిక్​టాక్ యాప్​ను నిషేధించాలన్న వాదనలు మరింత పెరిగాయి.

భర్త మందలించాడని..

తమిళనాడులో శీరన్తమ్​ గ్రామవాసి అనిత. అమెకు ఇద్దరు పిల్లలు. భర్త సింగపూర్​లో పనిచేస్తున్నాడు. టిక్​ టాక్​ యాప్​ అనితను విపరీతంగా ప్రభావితం చేసింది. రోజూ ఎన్నో వీడియోలను యాప్​లో పోస్ట్​ చేసేది. పిల్లలకు జ్వరం వచ్చినా పట్టించుకోకుండా యాప్​లో మునిగిపోయేది అనిత. ఇది గమనించిన భర్త అనితను మందలించాడు.

టిక్​ టాక్ వద్దన్నందుకు మనస్తాపానికి గురైన అనిత అత్మహత్య చేసుకోవడానికి నిశ్చయించింది. చిన్న పిల్లలు తల్లి లేని వారవుతారన్న ఆలోచన కూడా మరిచి పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంది. విషపు మందు తాగుతున్న దృశ్యాలను చిత్రీకరించి యాప్​లో పోస్ట్​ చేసి ప్రాణాలు విడిచింది.

ఇదీ చూడండి:- మోదీ హైతో ముమ్కిన్​ హై: పాంపియో

Intro:Body:

rt

Conclusion:
Last Updated : Jun 13, 2019, 1:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.