ETV Bharat / bharat

అగ్నిమాపక వాహనంలోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ - fire service vehicle news

అంపన్​ తుపాన్​తో తీవ్ర ప్రభావితమైన ఒడిశాలోని కేంద్రపార జిల్లాలో ఓ మహిళ అగ్నిమాపక వాహనంలోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Woman delivers baby in fire service vehicle
అగ్నిమాపక వాహనంలోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
author img

By

Published : May 20, 2020, 3:13 PM IST

అంపన్​ తుపాన్​తో ఒడిశా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి ఎన్​డీఆర్​ఎఫ్​, అగ్నిమాపక సిబ్బంది. కేంద్రపార జిల్లాలో పురుటినొప్పులతో బాధపడుతున్న ఓ మహిళను ఆస్పత్రికి తరలిస్తోన్న సమయంలో అగ్నిమాపక వాహనంలోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

తల్లీబిడ్డలను జిల్లాలోని మహకల్పడ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు తెలిపారు అధికారులు. క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు.

" జిల్లాలోని ఝంహర గ్రామంలో జానకి సేతి (20) అనే గర్భిణి వరదల్లో చిక్కుకుంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు చుట్టుపక్కల వారు మాకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకోవటానికి చాలా ఇబ్బందులుపడ్డారు. దారికి అడ్డంగా పడిపోయిన 22 చెట్లను తొలగించి అక్కడికి చేరుకుని, ఆ మహిళను అగ్నిమాపక వాహనంలో తరలించారు. మార్గమధ్యలోనే పురిటినొప్పలు ప్రారంభమయ్యాయి. సిబ్బంది సాయంతో బిడ్డకు జన్మనిచ్చింది."

– పీకే దష్​, జిల్లా ఉప అగ్నిమాపక అధికారి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.