ETV Bharat / bharat

పౌరసత్వ బిల్లు ఉపసంహరణకు మేధావుల డిమాండ్​ - పౌర బిల్లుపై విపక్షాల ఆందోళన

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న పౌరసత్వ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని పలువురు ప్రముఖులు కోరారు. ఈ మేరకు 600 మందికిపైగా రచయితలు, కళాకారులు, మాజీ న్యాయమూర్తులు, ప్రముఖులు ప్రభుత్వానికి చేసిన అభ్యర్థనలో సంతకాలు చేశారు.

Withdraw 'discriminatory', 'divisive' citizenship bill: Artistes, writers, ex-judges to govt
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా మేధావుల బహిరంగ లేఖ
author img

By

Published : Dec 11, 2019, 6:01 AM IST

Updated : Dec 11, 2019, 7:01 AM IST

పౌరసత్వ సవరణ బిల్లుపై పలువురు మేధావులు, విద్యావేత్తలు, నటులు, చరిత్రకారులు, మాజీ ఐఏఎస్‌ అధికారులు, మాజీ న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు నటి నందితా దాస్‌, దర్శకురాలు అపర్ణా సేన్‌, చరిత్రకారిణి రోమిలా థాపర్‌ సహా ఆయా వర్గాలకు చెందిన 600 మంది బహిరంగ లేఖ విడుదల చేశారు.

పౌరసత్వ సవరణ బిల్లు ప్రజలను విడగొడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం పొందుపర్చిన సమాఖ్య వ్యవస్థను ఈ బిల్లు దెబ్బతీస్తుందని, ఇది అమలులోకి వస్తే భారత సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుందని వీరు ఆందోళన వ్యక్తం చేశారు. సమానత్వాన్ని, లౌకికతత్వాన్ని గౌరవించాలనే రాజ్యాంగ స్ఫూర్తిని గుర్తించాలని సూచించారు.

మతప్రాదికన తయారుచేసిన ఈ బిల్లు ప్రజలను విభజించేదిగా, ప్రజల పట్ల వివక్ష చూపేదిగా రాజ్యాంగవిరుద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులైన సమానత్వం, కుల, మత, జాతి, లింగ, వర్గ, తరగతి, భాషలను ఉదహరిస్తు, పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్‌ఆర్‌సీ) వంటి వాటి వల్ల ప్రజల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అంతేకాకుండా ఇవి భారత ప్రజాస్వామ్య స్వభావాన్ని ప్రాథమికంగా, కోలుకోలేని విధంగా దెబ్బతీస్తాయనే ఆందోళన వ్యక్తం చేశారు.

Puducherry, Dec 11 (ANI): Several devotees lit up earthen lamps (diyas) on the occasion of 'Karthigai Deepam' in Puducherry on December 10. Devotees celebrated the festival with full fervour and joy in Sivasubramanian Temple of Puducherry. Devotees thronged in large numbers to witness the lighting of 'Karthigai Deepam'. The festival is dedicated to worship Lord Murugan. The day coincides with Purnima or the full moon night in the Tamil month of Karthigai.
Last Updated : Dec 11, 2019, 7:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.