ETV Bharat / bharat

ట్రాఫిక్ చలానా భయంతో వీళ్లు ఏం చేస్తున్నారో చూడండి...

మహానగరాల్లో ఉండే ట్రాఫిక్​లో రోడ్డు దాటాలంటే ఇబ్బందే. అందుకే, పాదచారుల కోసం ప్రత్యేక వంతెనలు నిర్మించింది ప్రభుత్వం. కానీ... ఇప్పుడా ఫుట్​ ఓవర్ బ్రిడ్జ్​లను ద్విచక్ర వాహనదారులు  వినియోగించుకుని తెగ పొదుపు చేసేసుకుంటున్నారు. ట్రాఫిక్​ నిబంధనలను ఉల్లంఘించి పోలీసులకు చిక్కకుండా తెలివిగా తప్పించుకుంటున్నారు.

ట్రాఫిక్ చలానా భయంతో వీళ్లు ఏం చేస్తున్నారో చూడండి...
author img

By

Published : Sep 12, 2019, 7:28 AM IST

Updated : Sep 30, 2019, 7:23 AM IST

ట్రాఫిక్ చలానా భయంతో వీళ్లు ఏం చేస్తున్నారో చూడండి...
ఆటో డ్రైవర్​కు రూ.50వేలు జరిమానా... లారీ చోదకుడికి రూ.లక్ష ఫైన్...! మోటారు వాహనాల చట్టం కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి వినిపిస్తున్న వార్తలు. వినేందుకే అమ్మో అనిపించే ఇంత భారీ జరిమానాను నిజంగా మనమే చెల్లించాలంటే..? చాలా కష్టం. అందుకే కొందరు అడ్డ దారులు తొక్కుతున్నారు. అలాంటి దృశ్యమే దిల్లీ స్వరూప్​నగర్​లోని చండీగఢ్​ జాతీయ రహదారిపై కనిపించింది. పాదచారుల వంతెనపై కొద్దిరోజులుగా ద్విచక్రవాహనాలు రయ్​రయ్​మని దూసుకెళ్తున్నాయి.

పాదచారుల కోసం లక్షలు వెచ్చించి ఈ వంతెన నిర్మించింది ప్రభుత్వం. ఈ ఫుట్​ ఓవర్ బ్రిడ్జ్​ దాటితే ఓ పోలీసు చెక్​పోస్ట్​ ఉంటుంది. హెల్మెట్, వాహనానికి సంబంధించిన దస్త్రాలు లేనివారు అటు వెళ్తే జరిమానా తప్పదు. అందుకే ఈ వంతెనను ఇలా అడ్డదారిగా వినియోగిస్తూ పోలీసులకే చుక్కలు చూపిస్తున్నారు కొందరు బైకర్లు. పైగా దూరాన్ని తగ్గించేందుకే ఇలా వంతెన పైనుంచి వస్తున్నామని కప్పిపుచ్చుకుంటున్నారు.

ఈ వంతెనకు పది అడుగుల దూరంలోనే పోలీస్​ స్టేషన్​ ఉన్నా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. శ్రుతిమించిన వాడకంతో వంతెన పూర్తిగా దెబ్బతింటోంది. కూలిపోయే స్థితికి చేరుకున్న వంతెనపై పాదచారులు ప్రాణాలు అరచేత పట్టుకుని రోడ్డు దాటుతున్నారు.

ఇదీ చూడండి:రాజస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురు మృతి

Intro:Body:Conclusion:
Last Updated : Sep 30, 2019, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.