దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా 26,382 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 99లక్షల 32వేల 548కి చేరింది. కరోనా కారణంగా మరో 387 మంది చనిపోగా.. మృతుల సంఖ్య 1లక్షా 44 వేల 096కు పెరిగింది.
కొత్తగా 33,813 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు వైరస్ నయం అయిన వారి సంఖ్య 94 లక్షల 56వేల 449కి పెరిగింది. 3లక్షల 32వేలకుపైగా యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 56శాతం మేర ఐదు రాష్ట్రాల్లోనే వస్తున్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. వాటిలో ఉత్తర్ప్రదేశ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బంగాల్, కేరళ, మహారాష్ట్ర ఉన్నట్లు పేర్కొంది.