ETV Bharat / bharat

ఆ విషయంలో నితీశ్​ను దాటేసిన తేజస్వీ - నితీశ్​ కుమార్​

ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్​.. బిహార్​ ఎన్నికల ప్రచారాల్లో దూసుకుపోయారు. మహాకూటమి సీఎం అభ్యర్థిగా 247 సభల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్​.. 160కుపైగా ఎన్నికల ప్రచారాలు నిర్వహించారు.

With 247 meetings, Tejashwi outshines others on campaign trail
ఆ విషయంలో నితీశ్​ను దాటేసిన తేజస్వీ
author img

By

Published : Nov 7, 2020, 6:15 PM IST

బిహార్​ ఎన్నికల ప్రచారాల్లో ఆర్​జేడీ యువనేత, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్​ దూసుకుపోయారు. మొత్తం 247 బహిరంగ సభలు నిర్వహించారు. అంటే రోజుకు సగటున 12 సభల్లో తన గళాన్ని వినిపించారు తేజస్వీ.

ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ సేవలు కోల్పోయిన పార్టీకి అన్నీ తానై నిలిచారు తేజస్వీ. తీరిక లేకుండా ప్రచారాలు నిర్వహించి.. రాష్ట్ర యువతను ఆకర్షించే ప్రయత్నం చేశారు. మహాకూటమిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.

మహాకూటమి తరఫున కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ 8సార్లు ప్రచారాలు నిర్వహించగా.. ఆ పార్టీ ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా 20 ర్యాలీల్లో పాల్గొన్నారు.

ఇదీ చూడండి:- 'మోదీ ఓటింగ్​ మిషన్లకు నేను భయపడను'

ఎన్​డీఏ తరఫున...

తేజస్వీ తర్వాత.. 160కుపైగా సభల్లో పాల్గొని బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ రెండో స్థానంలో నిలిచారు. వీటిల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి ఆరుసార్లు వేదికను పంచుకున్నారు నితీశ్​. వీటితో పాటు వర్చువల్​ సమావేశాలనూ నిర్వహించారు ముఖ్యమంత్రి.

బిహార్​లో ప్రధాని మోదీ మొత్తం 8 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 22 ఎన్నికల ర్యాలీలకు హాజరయ్యారు. వీటితో పాటు రోడ్​షోలు, సమావేశాలు నిర్వహించారు.

ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రితో 19 సభలను ఏర్పాటు చేయించింది ఎన్​డీఏ. కేంద్ర మంత్రులు రాజ్​నాథ్​ సింగ్​, స్మృతి ఇరానీ, అనురగ్​ ఠాకుర్​, ధర్మేంద్ర ప్రధాన్​లు కూడా ఎన్నికల ప్రచారాల్లో పాలుపంచుకున్నారు.

243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్​లో మొత్తం మూడు దశలుగా ఎన్నికలు జరిగాయి. ఈ నెల 10న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి:- రాజకీయాల నుంచి ముఖ్యమంత్రి రిటైర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.