ప్రతిపక్షాలపై విమర్శలను తీవ్రతరం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశంలో అస్థిరత నెలకొల్పి ప్రజలను గందరగోళంలోకి నెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను అబద్ధాల పుట్టగా అభివర్ణించారు ప్రధాని. అందులోని అంశాలు సైనికులను అవమాన పరిచే విధంగా ఉన్నాయని ఆరోపించారు.
మహారాష్ట్ర గోందియాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మోదీ. యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలను.. చక్కదిద్దేందుకు ఐదేళ్లుగా కృషి చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు. సంఘ వ్యతిరేక శక్తుల పట్ల కాంగ్రెస్-ఎన్సీపీ సానుభూతి కనబరుస్తున్నాయని ఆరోపించారు మోదీ
"కాంగ్రెస్ కారణంగా దేశంలో మరోసారి అస్థిరత నెలకొనే పరిస్థితి ఏర్పడింది. వీలైనంత దోచుకోవడం, లేదంటే ప్రజల్ని అయోమయంలో పడేయటం వాళ్లకున్న అలవాటు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో భారత సైనికుల మనోబలాన్ని దెబ్బతీసేలా ఉంది. దేశాన్ని ఛిన్నాభిన్నం చేసే వారికి మేలు చేసేలా ఉంది. పొరపాటున మహారాష్ట్రలో మహాకూటమి అధికారంలోకి వచ్చిందో నక్సల్స్, మావోయిస్టు సానుభూతి పరులకు మరింత బలం చేకూరుతుంది. దేశద్రోహులకు స్వేచ్ఛనివ్వాలనుకునేవారికి అధికారమిస్తారా?"
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఇదీ చూడండి:మోదీకి బహిరంగ చర్చకొచ్చే ధైర్యముందా?: దీదీ