ప్రభుత్వం కేటాయించిన దిల్లీలోని నివాస గృహాన్ని ఆగస్టు 1వ తేదీలోపు ఖాళీ చేయనున్నట్లు వెల్లడించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ప్రభుత్వం జారీ చేసిన నోటీసులను అనుసరించే నెల రోజుల్లోపు ఖాళీ చేస్తామని స్పష్టం చేశారు.
నివాస సదుపాయాన్ని పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వచ్చిన మీడియా నివేదికలను తోసిపుచ్చారు ప్రియాంక.
-
This is FAKE NEWS.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
I have not made any such request to the government. As per the eviction letter handed to me on the 1st of July, I will be vacating the government accommodation at 35 Lodhi Estate by the 1st of August.https://t.co/GkBO5dkaLs
">This is FAKE NEWS.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 14, 2020
I have not made any such request to the government. As per the eviction letter handed to me on the 1st of July, I will be vacating the government accommodation at 35 Lodhi Estate by the 1st of August.https://t.co/GkBO5dkaLsThis is FAKE NEWS.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 14, 2020
I have not made any such request to the government. As per the eviction letter handed to me on the 1st of July, I will be vacating the government accommodation at 35 Lodhi Estate by the 1st of August.https://t.co/GkBO5dkaLs
అవి తప్పుడు వార్తలు. ప్రభుత్వానికి నేను అలాంటి అభ్యర్థనలు చేయలేదు. జులై 1న అందిన నోటీసుల ప్రకారం.. ఆగస్టు 1లోపు లోధిలోని 35వ నంబరు ప్రభుత్వ నివాస గృహాన్ని ఖాళీ చేస్తాను.
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.
జులై 1న నోటీసులు..
1997లో ప్రభుత్వం దిల్లీలో కేటాయించిన నివాస గృహాన్ని నెల రోజుల్లో ఖాళీ చేయాలని కేంద్రం జులై 1న ప్రియాంక గాంధీకి నోటీసులు జారీ చేసింది కేంద్రం. గతేడాది నవంబర్లో సోనియా గాంధీ కుటుంబానికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రతను ఉపసంహరించిన నేపథ్యంలో.. నిబంధనల ప్రకారం జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తులకు ప్రభుత్వ వసతిని వినియోగించుకునే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేసింది.