ETV Bharat / bharat

'ఉద్ధవ్​ ఠాక్రే సర్కారుకు ఏ ఢోకా లేదు'

అసలే కరోనా ఉద్ధృతి.. కూటమి ప్రభుత్వంలో తమకు తగిన గౌరవం ఇవ్వట్లేదని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు.. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్ధవ్​ ఠాక్రే ప్రభుత్వం మహారాష్ట్రలో ఐదేళ్లు పరిపాలన సాగిస్తుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఊహాగానాలకు చెక్​ పెట్టేలా ఓ వ్యాసాన్ని ప్రచురించింది శివసేన అధికారిక పత్రిక సామ్నా. మహా వికాస్​ అఘాడీ ప్రభుత్వానికి ఏ ఢోకా లేదని పునరుద్ఘాటించింది.

Will uddhav thakrey govt govt be stable?
మహారాష్ట్రలో ఉద్ధవ్​ ఠాక్రే సర్కారు నిలిచేనా..?
author img

By

Published : Jun 16, 2020, 6:56 PM IST

మహారాష్ట్రలో కాంగ్రెస్​-శివసేన-ఎన్సీపీ కూటమితో ఏర్పాటైన మహా వికాస్​ అఘాడీ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని మరోమారు పునరుద్ఘాటించింది శివసేన. మహా వికాస్​ అఘాడీలో తమను విస్మరిస్తోందని ఇటీవలే కాంగ్రెస్​ పార్టీ ఆరోపించిన నేపథ్యంలో.. ఈ మేరకు తమ అధికారిక పత్రిక సామ్నాలో వ్యాసాన్ని ప్రచురించింది శివసేన.

" వేర్వేరు సిద్ధాంతాలున్న పార్టీల మధ్య కలహాలు సహజమే.. అయినప్పటికీ మహా వికాస్​ అఘాడీ ప్రభుత్వానికొచ్చిన ప్రమాదమేమీ లేదు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడేవారు కాంగ్రెస్​లో చాలామంది ఉన్నారు. అందుకే ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి ఠాక్రే కచ్చితంగా సిద్ధమై ఉండాలి.

అసలు కాంగ్రెస్​ ఏం చెప్పాలనుకుంటోంది? బాలాసాహెబ్​ థోరట్​, అశోక్​ చవాన్​ లాంటి కాంగ్రెస్​ నాయకులకు సుదీర్ఘకాలం ప్రభుత్వంలో కొనసాగిన అనుభవం ఉంది. ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​ కూడా ప్రభుత్వంలో చాలాకాలం పనిచేశారు. కానీ ఎన్సీపీ నుంచి ఎలాంటి ఫిర్యాదులూ లేవు. కాంగ్రెస్​ నాయకులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎంతటివారైనా ముఖ్యమంత్రి ఆదేశానుసారం నడుచుకోవాల్సిందే. అయినప్పటికీ చవాన్​, థోరట్​ లాంటి వారి మాటలను ఠాక్రే వినాల్సిందే."

- సామ్నా వ్యాసం

కాంగ్రెస్​ ఆరోపణలివే..

కీలక అంశాల చర్చల్లో ఉద్ధవ్​ ఠాక్రే ప్రభుత్వం కాంగ్రెస్​ పార్టీని విస్మరిస్తోందని ఇటీవలే కాంగ్రెస్​ పార్టీ నాయకుడొకరు ఆరోపించారు,"నిసర్గ తుపాను, కొవిడ్​-19కు సంబంధించిన అంశాలపై మహారాష్ట్ర సర్కారు ఎన్సీపీతోనే సమాలోచనలు జరిపింది. మమ్మల్ని పట్టించుకోలేదు" అని వ్యాఖ్యానించారు. శాసనమండలికి పంపబోయే 12 మంది సభ్యుల తుది జాబితాను సిద్ధం చేసేందుకు వీలైనంత త్వరగా మూడు పార్టీల నేతలు చర్చలు జరిపేలా చర్యలు తీసుకోవాలని కూడా కోరింది కాంగ్రెస్​.

మహా వికాస్​ అఘాడీలో కాంగ్రెస్​ను మూడో స్తంభంగా అభివర్ణించిన సామ్నా.. కూటమి ఏర్పాటులో శివసేనే ఎక్కువ వదులుకోవాల్సి వచ్చిందని రాసుకొచ్చింది.

మహా వికాస్​ అఘాడీ

288 సీట్లున్న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. ఫలితంగా శివసేన(56), ఎన్సీపీ(54), కాంగ్రెస్(44)​ మహా వికాస్​ అఘాడీ కూటమిగా ఏర్పడి ​ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.