కర్తార్‌పుర్ నడవా నిర్మాణంపై పాకిస్థాన్‌తో తలెత్తిన విభేదాలను జులై 14న జరగబోయే సమావేశంలో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లు చెప్పారు.
నడవా సాకారమైతే ఇరుదేశాల సిక్కు భక్తులు తమ పవిత్ర క్షేత్రాల్ని ఎలాంటి వీసా లేకుండానే దర్శించుకోగలుగుతారు.
జులై 14న రెండోసారి..
కర్తార్‌పుర్ నడవా నిర్మాణంపై పాకిస్థాన్‌తో భారత భూభాగంలోని అటారీ-వాఘా సరిహద్దులో మార్చి 14న మొదటి సమావేశం జరిగింది. జులై 14న పాకిస్థాన్ భూభాగం వాఘా సరిహద్దులో ఇరు దేశాల ప్రతినిధులు సమావేశమవుతారు.
జులై 11 నుంచి 14 మధ్య మరోసారి చర్చలు జరపాలని పాక్‌ను భారత్ కోరింది. 14వ తేదీన చర్చించేందుకు అంగీకరించింది దాయాది దేశం. కర్తార్‌పుర్ ప్రాజెక్టుకై పాక్ నియమించిన కమిటీలో ఖలిస్థానీ వేర్పాటువాదికి చోటు కల్పించాలని భారత్ సూచించింది.
సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లేఖ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఆ సందర్భంలో కర్తార్‌పుర్ నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఇమ్రాన్‌కు సూచించారు మోదీ.
ఇదీ చూడండి: పద్దు-19: కోట్లాది ప్రజల ఆకాంక్షల నడుమ నేడే బడ్జెట్