ETV Bharat / bharat

'భారత్​ ప్రయోజనాల మేరకే ఆర్​సీఈపీ​లో చేరిక'

author img

By

Published : Nov 2, 2019, 12:13 PM IST

Updated : Nov 2, 2019, 7:39 PM IST

థాయిలాండ్​లో మూడు రోజుల పర్యటనలో భాగంగా బ్యాంకాక్​ వెళ్లారు ప్రధాని నరేంద్రమోదీ. బ్యాంకాక్​లో జరిగే ఆసియాన్​తోపాటు ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య కూటమి(ఆర్​సీఈపీ)సదస్సులో పాల్గొననున్నారు. అయితే ఈ​ కూటమిలో భారత్​ చేరుతుందా? లేదా? అని నెలకొన్న సందిగ్ధంపై ప్రధాని స్పష్టతనిచ్చారు.

మోదీ

థాయిలాండ్​లో జరిగే కీలక సదస్సులకు హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్రమోదీ.. ఈ రోజు ఉదయం బ్యాంకాక్​ బయలుదేరారు. ఆసియాన్​, తూర్పు ఆసియాతో పాటు ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య కూటమి(ఆర్​సీఈపీ) సదస్సుల్లో మోదీ పాల్గొంటారు.

నవంబర్​ 4న ఆర్​సీఈపీ ఒప్పందం జరగనుంది. దీనిపై చర్చల్లో పాల్గొననున్న మోదీ.. కూటమిలో చేరే విషయంపై వస్తున్న ఊహాగానాలపై స్పష్టతనిచ్చారు. థాయిలాండ్​ బయలుదేరే ముందు ఈ విషయంపై మాట్లాడారు.

"ఈ సదస్సులో భారత వాణిజ్యానికి సంబంధించి వస్తువులు, సేవలు, పెట్టుబడులు సంబంధించిన అన్నీ మనకు కేటాయిస్తేనే.. కూటమిలో చేరే విషయాన్ని పరిశీలిస్తాం. భారత్​ తూర్పు విదేశాంగ విధానానికి కీలకంగా ఉన్న ఆర్​సీఈపీ​పై ఆచితూచి వ్యవహరిస్తాం. "

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఆసియా సదస్సుల్లో..

ఆసియాన్​ సంబంధిత సదస్సులు భారత దౌత్య వ్యవహారాల్లో కీలకమైనవని మోదీ అన్నారు. ఆసియాన్​తో భాగస్వామ్యంలో సమాచార వ్యవస్థ, సామర్థ్య పెంపు, వాణిజ్యం, సాంస్కృతిక భాగస్వామ్యం మూలస్తంభాల్లాంటివని తెలిపారు.

తూర్పు ఆసియా సదస్సు(ఈఏఎస్).. ప్రాంతీయ సహకార నిర్మాణంలో ఇటీవల కీలకంగా మారిందని మోదీ గుర్తుచేశారు. ఇందులో ముఖ్యమైన దేశాలు భాగం పంచుకున్నాయన్నారు.

'సావాస్​దీ మోదీ' కార్యక్రమం

బ్యాంకాక్​కు చేరుకున్న అనంతరం మోదీకి థాయిలాండ్​లోని భారతీయులు స్వాగతం పలకనున్నారు. అక్కడి భారతీయులు శనివారం సాయంత్రం నిర్వహించే 'సావాస్​దీ మోదీ' కార్యక్రమానికి హాజరవనున్నట్లు తెలిపారు ప్రధాని. థాయిలాండ్​ అభివృద్ధికి భారత సంతతి వ్యక్తులు, ఎన్​ఆర్​ఐలు ఎంతో కృషి చేశారని తెలిపారు.

ఇదీ చూడండి : చైనావ్యాప్తంగా 5జీ సేవలు షురూ- భారత్​లో ఎప్పుడో?

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Nov 2, 2019, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.