ETV Bharat / bharat

స్టాలిన్​ను దాటి అన్నాడీఎంకే హ్యాట్రిక్​ కొట్టేనా?

తమిళనాడులో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ఊవిళ్లూరుతోంది ద్రవిడ పార్టీ అధికార అన్నాడీఎంకే. మాజీ ముఖ్యమంత్రి జయలలిత లేని ఈ పార్టీ మరోసారి నెగ్గి.. దివంగత ఎంజీఆర్​ రికార్డును సమం చేస్తుందా? అందుకు.. మరో ద్రవిడ పార్టీ డీఎంకే అవకాశమిస్తుందా? రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ప్రాంతీయ పార్టీల గత ప్రదర్శన, బలాబలాలను ఓసారి పరిశీలిద్దాం.

Will ruling AIADMK return to power third time in a row
స్టాలిన్​ను దాటి అన్నాడీఎంకే హ్యాట్రిక్​ కొట్టేనా?
author img

By

Published : Feb 7, 2021, 5:00 PM IST

ప్రాంతీయ పార్టీల హవా నడిచే రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. 5 దశాబ్దాలకుపైగా ఆల్​ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం(ఏఐఏడీఎంకే), డీఎంకే పార్టీలే అక్కడ అధికారంలో ఉన్నాయి. పరస్పరం అధికారాన్ని మార్చుకుంటూ వస్తున్నాయి. అయితే.. క్రితం సారి గెలిచి వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన అన్నాడీఎంకే.. హ్యాట్రిక్​ కొట్టాలని భావిస్తోంది.

దివంగత ఎంజీ రామచంద్రన్​ మాత్రమే గతంలో అన్నాడీఎంకేను వరుసగా మూడు సార్లు గెలిపించారు. అంతకుముందు 1952-67 మధ్య కాంగ్రెస్​ కూడా వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో.. ఏప్రిల్​-మేలో జరిగే ఎన్నికలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. మరి.. ఈ రికార్డును అన్నాడీఎంకే సమం చేస్తుందా? అంటే కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

MG RAMACHANDRAN
ఎంజీ రామచంద్రన్​

డీఎంకే గట్టిపోటీ..?

ఈ వేసవిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్​ కొట్టాలని భావిస్తున్న 'అన్నాడీఎంకే'కు అదంత సులువైన విషయమేమీ కాకపోవచ్చు. కారణం.. మొదటి అడ్డు స్టాలిన్​ నేతృత్వంలోని డీఎంకే. రెండోది ప్రభుత్వ వ్యతిరేకత.

2011 నుంచి తమిళనాడులో అన్నాడీఎంకేదే అధికారం. ఇన్నేళ్ల పాలన తర్వాత ప్రభుత్వంపై వ్యతిరేకత సాధారణమే. ఇదే వచ్చే ఎన్నికల్లో గణనీయ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే తమకు అనుకూలంగా మలుచుకొని అధికారంలోకి రావాలని డీఎంకే చూస్తోంది.

STALIN
స్టాలిన్​

లోక్​సభ ఎన్నికల్లో షాక్​..

ఇప్పటికే 2019 లోక్​సభ ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టిదెబ్బ తగిలింది. 39 స్థానాలకు గానూ 38 చోట్ల డీఎంకే కూటమి విజయదుందుభి మోగించింది. అన్నాడీఎంకే కేవలం ఒక్కచోటే నెగ్గడం గమనార్హం.

ఈ షాక్​ నుంచి తేరుకొని.. వాస్తవాన్ని గ్రహించిన అధికార పార్టీ.. అనంతరం జరిగిన అసెంబ్లీ ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికలు జరిగిన రెండు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది.

PALANI SWAMI
పళనిస్వామి

ముగ్గురు దిగ్గజాలే..

డీఎంకే విషయానికి వస్తే.. పార్టీ స్థాపకుడు అన్నాదురై 1969లో మరణించిన అనంతరం ఏడేళ్లు(1977 వరకు) ముఖ్యమంత్రిగా కొనసాగారు దివంగత కరుణానిధి. ఆ సమయంలోనే డీఎంకే నుంచి బయటికొచ్చిన ఎంజీఆర్​.. ఏఐఏడీఎంకేను స్థాపించి 1987 వరకు రాష్ట్రాన్ని పాలించారు.

KARUNANIDHI
కరుణానిధి

1989-2011 మధ్య ప్రతిసారీ అధికారం రెండు పార్టీల మధ్య చేతులు మారుతూ వచ్చింది. 2011 తర్వాతే పరిస్థితులు మారిపోయాయి. దివంగత జయలలిత వరుసగా రెండు సార్లు అన్నాడీఎంకేను అధికారంలోక తీసుకొచ్చారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇదో కీలక మలుపుగా చెప్పుకోవచ్చు.

2016 ఎన్నికల్లో..

అయితే 2011లో ప్రతిపక్ష హోదాను కోల్పోయిన డీఎంకే.. 2016లో కూటమిని ఏర్పాటు చేసింది. నిజానికి ఈ ఎన్నికల్లో ఇరు కూటముల మధ్య హోరాహోరీ పోరు నడిచింది. ఓట్ల తేడా చాలా తక్కువే. మిత్రపక్షాలు పెద్దగా ప్రభావం చూపని కారణంగా.. 1.1 శాతం వ్యత్యాసంతో సీఎం పీఠానికి ఆమడ దూరంలో నిలిచిపోయింది డీఎంకే.

ఇదీ చూడండి: తమిళనాట ఎన్నికల వేడి- కాంగ్రెస్​కు చావోరేవో!

234 స్థానాలకు గానూ అన్నాడీఎంకే కూటమి 136 చోట్ల నెగ్గగా.. డీఎంకే కూటమి 98 స్థానాల్లో(డీఎంకే 89, కాంగ్రెస్​ 8, ఐయూఎంఎల్​ 1) విజయం సాధించింది.

అమ్మ పోయాక..

అయితే.. 2016లో జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేలో చీలికలు వచ్చాయి. అమ్మ సన్నిహితురాలు వీకే శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం.. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి జైలుకెళ్లారు.

JAYALALITHA
జయలలిత

ఇదీ చూడండి: 'చిన్నమ్మ వస్తే తమిళనాడులో అల్లర్లే'

ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఓ పన్నీర్​ సెల్వం(ఓపీఎస్​), ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్​), శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్​.. ముగ్గురూ వేరయ్యారు. కొన్ని నెలల అనిశ్చితి తర్వాత.. ఓపీఎస్​-ఈపీఎస్​ ఒక్కటయ్యారు. పళనిస్వామి సీఎం, పన్నీర్​సెల్వం డిప్యూటీ సీఎంగా ఉన్నారు.

OPS-EPS
ఓపీఎస్​-ఈపీఎస్​

ఇదీ చూడండి: అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా పళనిస్వామి

అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఓపీఎస్​-ఈపీఎస్​ నేతృత్వంలోని అన్నాడీఎంకే మరోసారి నెగ్గదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు పి. రామజయం.

'' అధికార అన్నాడీఎంకే మరోసారి అధికారంలోకి రాదు. రాష్ట్రంలో 3 దశాబ్దాల కిందటి పరిస్థితి ఇప్పుడు లేదు.''

- పి. రామజయం, రాజకీయ విశ్లేషకులు

1969-77 మధ్య డీఎంకే ఎన్నో ప్రజాసంక్షేమ పథకాలు తీసుకొచ్చినా.. వ్యతిరేక ప్రచారం కారణంగానే ఓటమి పాలయ్యిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు అదే అన్నాడీఎంకేకు ఓటమి కొనితెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. భాజపాతో పొత్తు కూడా ఇందుకు ఓ కారణంగా ఉండొచ్చని చెబుతున్నారు.

ఇవీ చూడండి:

డీఎంకే-కాంగ్రెస్​ విజయం తథ్యం: అయ్యర్

ఎన్నికల వేళ తమిళనాడు సర్కార్​ వరాల జల్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.