ETV Bharat / bharat

పార్లమెంటుకు వచ్చే ఎంపీలకు కరోనా టెస్టులు! - OM brila review parliament session arrangements

పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్​ 14న ప్రారంభ కానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై సమీక్షించారు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా. ఉభయ సభల అధికారులు, ఆరోగ్య శాఖ, డీఆర్​డీఓ అధికారులతో సమావేశమై చర్చించారు. 72 గంటల ముందే ఎంపీలు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు స్పీకర్​.

Monsoon Session of Parliament
పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు
author img

By

Published : Aug 28, 2020, 6:06 PM IST

పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లపై వరుసగా రెండోరోజు సమీక్షించారు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా. ఉభయ సభలకు చెందిన అధికారులు, ఆరోగ్య శాఖ, డీఆర్​డీఓతో పాటు ఇతర విభాగాల అధికారులతో సమావేశమై చర్చించారు.

" ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారమే లోక్​సభ, రాజ్యసభలో సీట్ల ఏర్పాటు ఉంటుంది. భౌతిక దూరం పాటించటం, పరిసరాలను శానిటైజ్​ చేయటం, సీట్ల కేటాయింపు వంటి అంశాలపై చర్చించాం. సమావేశాలకు 72 గంటల ముందు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎంపీలను కోరనున్నాం. కొవిడ్​-19 పరీక్షా కేంద్రాలను పార్లమెంట్​ ప్రాంగణంలోనే ఏర్పాటు చేయనున్నాం. "

- ఓం బిర్లా, లోక్​సభ స్పీకర్​.

పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్​ 14న ప్రారంభమై అక్టోబర్​ 1న ముగియనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల వివరాలను లోక్​సభ ప్రధాన కార్యదర్శి స్నేహలత శ్రీవాస్తవ, రాజ్యసభ ప్రధాన కార్యదర్శి దేశ్​ దీపక్​ వర్మ.. ఓం బిర్లాకు నివేదించారు.

విడతల వారీగా..

కరోనా కారణంగా సభ్యుల సీట్ల మధ్య దూరం పెంచాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే గ్యాలరీల్లో కూడా సభ్యులకు సీట్లను ఏర్పాటు చేయనున్నారు. కొందరు సభ్యులకు రాజ్యసభలో సీట్లను కేటాయిస్తారు. రాజ్యసభ సభ్యులకు కూడా ఇవే నిబంధనలను అమలు చేయనున్నారు. అందుకోసం లోక్​సభ, రాజ్యసభ సమావేశాలను విడతల వారీగా జరపాలని నిర్ణయించారు. ​

ఇదీ చూడండి: వర్షాకాల సమావేశాల ఏర్పాట్లపై స్పీకర్‌ సమీక్ష,

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.