కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న వేళ ఎన్‌డీఏకు కూటమిలోని పార్టీల నుంచి సెగ తగులుతోంది. రైతుల డిమాండ్‌కు అంగీకరించాలని ఒత్తిడి తెస్తున్నాయి. తాజాగా రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ(ఆర్ఎల్పీ) రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించింది. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలని ఆ పార్టీ ఎంపీ హనుమాన్ బనివాల్ ట్విట్టర్ ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
లేనిపక్షంలో ఎన్డీఏ కూటమిలో కొనసాగే విషయమై పునరాలోచించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రైతుల ఆందోళనలను అణిచివేయాలని చూస్తే దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహిస్తామని ఆర్ఎల్పీ ఎంపీ పేర్కొన్నారు. ఇప్పటికే వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శిరోమణి అకాలీదళ్ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగింది.
ఇదీ చూడండి: సాగుచట్టాల చర్చ వేళ 'ఆడియో కట్'పై ప్రభుత్వం క్లారిటీ