ETV Bharat / bharat

బంగాల్​లో రాజుకున్న వేడి- దీదీ సర్కారుకు తిప్పలేనా ?

మరో ఏడాదిలో మోగనుంది.. బంగాల్​ ఎన్నికల నగారా. కానీ, ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్​, ప్రతిపక్షం భాజపా మధ్య.. పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలోనే బంగాల్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బంగాల్‌ సచివాలయ ముట్టడికి భాజాపా... 'నబన్నా ఛలో' ర్యాలీ చేపట్టింది. పోలీసులు వీరిని ఎక్కడికక్కడ అడ్డుకోవటం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీని పర్యవసానాలు కాషాయం పార్టీకే కలిసొస్తాయంటున్నారు విశ్లేషకులు.

Bengal's colour at the hustings
బంగాల్​లో రాజుకున్న రాజకీయ వేడి.. దీదీ సర్కారుకు తిప్పలేనా ?
author img

By

Published : Oct 9, 2020, 1:11 PM IST

Updated : Oct 9, 2020, 1:23 PM IST

వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. దీదీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వ హయాంలో.. పెరుగుతున్న నిరుద్యోగం, ఉపాధ్యాయుల నియామకంలో అక్రమాలు, శాంతి భద్రతలు క్షీణించడం సహా ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ సచివాలయ ముట్టడికి భాజాపా యువ మోర్చా ప్రయత్నించటం, దాన్ని పోలీసులు అడ్డుకున్న తీరు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నిరసనలను అడ్డుకోవటంలో రాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరు.. భాజపాకు కలిసివచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వాస్తవానికి భాజపా యువ మోర్చా దాదాపు నెలరోజుల క్రితమే నబన్నా ఛలో ర్యాలీకి పిలుపు నిచ్చింది. ఇందుకు సంబంధించి అన్ని సన్నాహకాలు చేసుకుంది. అయితే, చివరి నిమిషంలో సీఎం మమతా బెనర్జీ ర్యాలీకి అనుమతి నిరాకరించారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా ఎలాంటి ర్యాలీలు చేయటానికి వీల్లేదని ఆందోళనకారులకు స్పష్టంచేశారు. ర్యాలీ చేయాల్సి వస్తే 100 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తామని తెలిపారు. మరోవైపు బంగాల్‌ పోలీసులు నిరసనలకు కేంద్ర బిందువైన సచివాలయం చుట్టూ బఫర్‌ జోన్లు ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ నిర్ణయం భాజపాకు ఇబ్బందిగా మారుతుందని అంతా భావించారు. కానీ ప్రభుత్వ ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయకుండా భాజపా కార్యకర్తలు రోడ్ల పైకి వచ్చారు. బంగాల్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ 'నబన్నా'ను చుట్టుముట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఇలా భాజపా యువ మోర్చా చేపట్టిన నబన్నా ఛలో కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసింది.

bengal
ఉద్రిక్తతలకు దారి తీసిన 'నబన్నా ఛలో'

పోలీసుల అత్యుత్సాహం

సచివాలయం వైపు ర్యాలీలను అడ్డుకోవటంలో... పోలీసులు చూపిన అత్యుత్సాహం మమతా బెనర్జీ సర్కారుపై వ్యతిరేకతగా మారే అవకాశమున్నట్లు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ విధానాలు వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్న వారిపై లాఠీ ఛార్జి చేయటం, బాష్పవాయు గోళాలు ప్రయోగించటం వంటి చర్యలు ప్రభుత్వంపై అసంతృప్తికి దారి తీసే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు. పోలీసుల దాడులతో ఇప్పటికే అనేక మంది నిరసనకారులు, భాజపా నాయకులు ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటనలు భాజపా రాష్ట్రంలో బలంగా నిలదొక్కుకునేందుకు సాయపడనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నిరసనలపై పోలీసులు ఉక్కుపాదం మోపడంపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్షాల కంటే క్రూరంగా ప్రతిపక్షాలను ప్రభుత్వం అణిచివేసిందని మండిపడ్డారు.

బంగాల్​లో 115 మంది భాజపా కార్యకర్తలు ఇప్పటివరకు మృతి చెందారని కేంద్రమంత్రి రవిశంకర్‌ అన్నారు. మమతా బెనర్జీ పాలనలో నిరసనలు తెలుపుకొనే స్వేచ్ఛ ఉందా అని ప్రశ్నించారు.

mamata
దీదీ సర్కారుకు తిప్పలేనా ?

సమర్థిస్తున్న తృణమూల్‌

తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు పోలీసుల తీరును సమర్థిస్తున్నారు. ఇది విధి నిర్వహణలో భాగంగా చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అల్పాన్‌ బందోపాధ్యాయ్‌ చెప్పుకొచ్చారు. మరోవైపు నిరసనకారుల నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర మంత్రి ఫర్హద్‌ హకీం ప్రకటించారు. నిరసనకారులు శాంతియుతంగా చేయాలని భావిస్తే ఇవి వారి వద్దకు ఎలా వస్తాయని ప్రశ్నించారు. అయితే, భాజపా నేతలు మాత్రం.. రసాయనాలతో పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తున్నారు.

ఈ వ్యవహారమంతా భాజపాకు బంగాల్​లో పొలిటికల్​ మైలేజీ ఇస్తుందనే అభిప్రాయం విశ్లేషకులు నుంచి వ్యక్తమవుతోంది. అదే సమయంలో, తృణమూల్​ రాజకీయాలను తక్కువ అంచనా వేయకూడదని గుర్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: బంగాల్​లో భాజపా ఆందోళనలు హింసాయుతం

Last Updated : Oct 9, 2020, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.