ఉత్తరప్రదేశ్ హర్దోయ్‌లో దారుణం జరిగింది. రాత్రి పూట కాస్త ఆలస్యంగా అన్నం వడ్డించినందుకు కట్టుకున్న భార్యనే కడతేర్చాడు శ్రీకృష్ణ అనే వ్యక్తి. భోజనం అనుకున్న సమయానికి పెట్టలేదని కోపంతో ఊగిపోయి.. విచక్షణారహితంగా భార్య పూనమ్‌పై దాడి చేసి చంపేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని సమీపంలోని పంటపొలంలో పాతిపెట్టాడు.
ఈ దారుణాన్ని కప్పిపుచ్చుకునేందుకు.. తన భార్య కనపించడంలేదని స్వయంగా తానే పోలీసులకు ఫిర్యాదు చేశాడు శ్రీకృష్ణ. తీరా శవం బయటపడే సరికి జరిగిందంతా పోలీసులకు చెప్పేశాడు. తానే పూనమ్‌ను హత్యచేసినట్లు అంగీకరించాడు. శ్రీకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చూడండి : చంద్రయాన్-2: రెండో సారి కక్ష్య తగ్గింపు విజయవంతం