నిర్భయ కేసు దోషులకు మరణ శిక్ష అమలుకు మరికొన్ని రోజుల సమయమే మిగిలుంది. ఈ నేపథ్యంలో తలారీగా మేరఠ్‌కు చెందిన పవన్ కావాలంటూ ఉత్తర్‌ప్రదేశ్ జైళ్ల శాఖకు తిహార్ డైరక్టరేట్ లేఖ రాసి అర్జీ పెట్టుకుంది.
"తలారీగా పవన్‌ను మాత్రమే ఎంపిక చేసుకోవడానికి మా వద్ద అనేక కారణాలు ఉన్నాయి. పవన్ తండ్రి, తాతలు తలారీలు. అందువల్ల తప్పు చేయడానికి అవకాశం తక్కువ. మరొకటి.. పవన్ శారీరకంగా దృఢంగా ఉన్నాడు. కంటి చూపుతోపాటు అన్ని అంశాలు అవసరానికి తగినట్లుగా ఉన్నాయి."
-లేఖ సారాంశం
పవన్ భద్రతకు సంబంధించి తామే చర్యలు తీసుకుంటామని యూపీ డైరెక్టరేట్‌కు తిహార్ జైలు తెలిపింది. ఒకవేళ యూపీ జైళ్ల శాఖ పవన్‌కు భద్రత కల్పించటం వీలుకాకపోతే ఆ బాధ్యత కూడా తామే తీసుకుంటామని తిహార్ జైలు తెలిపింది.
నిర్భయ కేసులో దోషులకు దిల్లీ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. ఈ నెల 22న ఉరి తీయనున్నారు అధికారులు.
ఇదీ చూడండి: నిర్భయ దోషుల 'ఉరి'కి ట్రయల్స్- మేరఠ్ నుంచే తలారి!