ETV Bharat / bharat

'సెప్టెంబర్​ చివరి నాటికి 65 లక్షల కరోనా కేసులు' - కేంద్ర మాజీ మంత్రి చిదంబరం

సెప్టెంబర్ చివరి నాటికి దేశంలో 65 లక్షల కరోనా కేసులు నమోదవుతాయని అంచనా వేశారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. 21 రోజుల్లో కరోనా కట్టడి చేస్తానని చెప్పిన ప్రధాని మోదీ.. ఆ పని ఎందుకు చేయలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు.

why India failed when other countries seem to have succeeded Chidambaram questions PM
ప్రధాని సమాధానం చెప్పాలి: చిదంబరం
author img

By

Published : Sep 5, 2020, 10:58 PM IST

కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఆర్థికమంత్రి చిదంబరం ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈనెల చివరినాటికి దేశంలో కరోనా కేసులు 65 లక్షలకు చేరుకుంటాయని అంచనా వేశారు. 'సెప్టెంబర్‌ 30 నాటికి 55 లక్షల కరోనా కేసులు నమోదవుతాయని మొదట అంచనా వేశాను. కానీ అది తప్పు. సెప్టెంబర్‌ 20 నాటికే ఆ సంఖ్యకు చేరుకుంటాం. నెలాఖరు వరకు దాదాపు 65 లక్షల కేసులు నమోదవుతాయి' అని చిదంబరం వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. '21 రోజుల్లో కరోనాను అంతం చేస్తామని ప్రకటించిన ప్రధాని మోదీ, వైరస్‌ కట్టడిలో ఇతర దేశాలు విజయం సాధిస్తుంటే మీరెందుకు విఫలమయ్యారో వెల్లడించాలి ' అని డిమాండ్‌ చేశారు. లాక్‌డౌన్‌తో ఎవరికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని అన్నారు.

  • The only country that is not reaping the benefit of the lockdown strategy appears to be India

    PM Modi who promised that we will defeat coronavirus in 21 days must explain why India failed when other countries seem to have succeeded

    — P. Chidambaram (@PChidambaram_IN) September 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పైనా విమర్శలు సంధించారు. 2020-21 జీడీపీ పతనమవ్వడానికి కారణాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు వెల్లడించలేదన్నారు. ‘వీ’ ఆకారపు రికవరీ ఉంటుందని ఎప్పటిలాగే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చిదంబరం ఆరోపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.