ETV Bharat / bharat

ప్రధాని మోదీని అభినందించిన డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​ - మోదీ

కరోనా వైరస్​ను అరికట్టడానికి ప్రపంచ దేశాలకు తోడ్పాటును అందిస్తున్నందకు ప్రధాని మోదీని డబ్ల్యూహెచ్​ఓ డైరక్టర్​ జనరల్ అభినందించారు.​ వైరస్ నిర్మూలనకు భారత్​ చేస్తున్న కృషి పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

WHO chief Ghebreyesus thanks PM Modi
ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​
author img

By

Published : Jan 23, 2021, 4:54 PM IST

Updated : Jan 23, 2021, 5:23 PM IST

కరోనా వైరస్ నిర్మూలనలో ప్రంపంచ దేశాలకు తోడ్పాటును అందిస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీని ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరక్టర్​ జనరల్​ అథనోమ్​ అ​భినందించారు. వివిధ దేశాలకు కరోనా టీకాను భారత్​ అందించడాన్ని ప్రశంసించారు.

కరోనా పోరులో ప్రపంచానికి తోడ్పాటు అందిస్తున్నందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. ఇలాగే మనం కలిసి కట్టుగా కృషి చేస్తే కరోనా వైరస్​ని అంతమొందించవచ్చు.

-అథనోమ్​ గేబ్రియాస్, డబ్ల్యూహెచ్​ఓ డైరక్టర్​ జనరల్​

పొరుగుదేశాలకు మొదటి ప్రాధాన్యం కింద భూటాన్​, బంగ్లాదేశ్​, మాల్దీవులు, నేపాలు, శ్రీలంక, అఫ్గానిస్థాన్​ , మియన్మార్​, సియ్​ చెల్లేస్​ దేశాలకు ఈ వారం కరోనా టీకాలను అందించాలని భారత్​ నిర్ణయించింది. ఇప్పటికే బంగ్లాదేశ్, నేపాల్​, భూటాన్​, మాల్దీవులకు వాక్సిన్​ను పంపించింది.

ఇదీ చూడండి: నేతాజీ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ

Last Updated : Jan 23, 2021, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.