మధ్యప్రదేశ్ రాజకీయం 'పులి' చుట్టూ తిరుగుతోంది. పులి ఇతివృత్తంగా పంచ్ డైలాగులతో నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
జులై 2న రాష్ట్ర కేబినెట్ విస్తరణ సందర్భంగా భాజపా నేత జ్యోతిరాదిత్య సింధియా 'పులి ఇంకా బతికే ఉంది' అని వ్యాఖ్యానించడం ఈ డైలాగ్ వార్‌కు దారితీసింది. ఇందుకు ప్రతిగా తమదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్.
ఇదీ జరిగింది..
మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో సింధియా వర్గానికి విశేష ప్రాధాన్యం లభించింది. ఆయన వర్గానికి చెందిన 12మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన సింధియా... కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 'పులి ఇంకా బతికే ఉంది' అని గుర్తుంచుకోవాలని వారిద్దరికీ సూచించారు.
-
मध्य प्रदेश के विकास, प्रगति, उन्नति और मेरे प्रदेशवासियों की रक्षा के लिए टाइगर अभी ज़िंदा है। pic.twitter.com/PEIi2vH7mj
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) July 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">मध्य प्रदेश के विकास, प्रगति, उन्नति और मेरे प्रदेशवासियों की रक्षा के लिए टाइगर अभी ज़िंदा है। pic.twitter.com/PEIi2vH7mj
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) July 2, 2020मध्य प्रदेश के विकास, प्रगति, उन्नति और मेरे प्रदेशवासियों की रक्षा के लिए टाइगर अभी ज़िंदा है। pic.twitter.com/PEIi2vH7mj
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) July 2, 2020
'పులుల స్వభావం ఏమిటో తెలుసా'
సింధియా వ్యాఖ్యలపై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. 'నీకు పులి స్వభావం తెలుసా? ఒక అడవిలో ఒకే పులి జీవిస్తుంది' అని ట్వీట్ చేశారు.
'జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావు సింధియా బతికి ఉండగా పులివేటపై నిషేధం లేదు. నాడు ఆయనతో కలిసి పులులను వేటాడే వాడిని. ఇందిరాగాంధీ ప్రభుత్వం పులుల వేటను నిషేధించాక కేవలం కెమెరాల్లోనే వాటిని బంధిస్తున్నా' అని వ్యాఖ్యానించారు డిగ్గీరాజా.
-
शेर का सही चरित्र आप जानते हैं? एक जंगल में एक ही शेर रहता है!! pic.twitter.com/i7PJzmPFAJ
— digvijaya singh (@digvijaya_28) July 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">शेर का सही चरित्र आप जानते हैं? एक जंगल में एक ही शेर रहता है!! pic.twitter.com/i7PJzmPFAJ
— digvijaya singh (@digvijaya_28) July 3, 2020शेर का सही चरित्र आप जानते हैं? एक जंगल में एक ही शेर रहता है!! pic.twitter.com/i7PJzmPFAJ
— digvijaya singh (@digvijaya_28) July 3, 2020
'ఏ పులి.. కాగితమా, సర్కసా?'
సింధియా వ్యాఖ్యలపై స్పందించారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్. 'ఏ పులి బతికుంది? కాగితంతో చేసినదా? సర్కస్‌లో ఫీట్లు చేసేదా?' అని ప్రశ్నించారు.
'కొంతమంది తమను తాము పులులుగా అభివర్ణించుకుంటారు. నేను పులిని కాదు. కాగితం పులిని అసలే కాదు. నేను మహారాజును కాదు. మామనూ కాదు' అని వ్యాఖ్యానించారు కమల్‌నాథ్.
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సింధియాను మహారాజుగా, సీఎం చౌహాన్‌ను మామ అని పిలుస్తారు.
-
मैं महाराजा नहीं हूं ,मैं मामा नहीं हूं , मैंने कभी चाय नहीं बेची , मैं तो बस कमलनाथ हूँ।
— Office Of Kamal Nath (@OfficeOfKNath) July 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
कई लोग कहते हैं कि मैं टाइगर हूं।
मैं तो ना टाइगर हूं , ना पेपर टाइगर हूं , अब यह तो प्रदेश की जनता तय करेगी , कौन क्या है ? pic.twitter.com/vv4Ldg1iDE
">मैं महाराजा नहीं हूं ,मैं मामा नहीं हूं , मैंने कभी चाय नहीं बेची , मैं तो बस कमलनाथ हूँ।
— Office Of Kamal Nath (@OfficeOfKNath) July 3, 2020
कई लोग कहते हैं कि मैं टाइगर हूं।
मैं तो ना टाइगर हूं , ना पेपर टाइगर हूं , अब यह तो प्रदेश की जनता तय करेगी , कौन क्या है ? pic.twitter.com/vv4Ldg1iDEमैं महाराजा नहीं हूं ,मैं मामा नहीं हूं , मैंने कभी चाय नहीं बेची , मैं तो बस कमलनाथ हूँ।
— Office Of Kamal Nath (@OfficeOfKNath) July 3, 2020
कई लोग कहते हैं कि मैं टाइगर हूं।
मैं तो ना टाइगर हूं , ना पेपर टाइगर हूं , अब यह तो प्रदेश की जनता तय करेगी , कौन क्या है ? pic.twitter.com/vv4Ldg1iDE
ఇదీ చూడండి: 'ఆ మాటలు 130 కోట్ల మంది భారతీయులకు ధైర్యం'