ETV Bharat / bharat

రాజధానిపై కరోనా పంజాకు వారి అలసత్వమే కారణమా? - గాంధీనగర్​లో కరోనా

ఆ నగరం.. ఓ రాష్ట్ర రాజధాని. దేశంలోని ప్రధాన నగరాలతో పోల్చితే జనాభా చాలాచాలా తక్కువ. అయినా అక్కడ కరోనా విజృంభిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అక్కడే ఉన్నా... వైరస్​ను కట్టడి చేసేందుకు అష్టకష్టాలు పడుతోంది. ఎందుకిలా? గాంధీనగర్​కు ఏమైంది?

etv bharat telugu
రాజధాని నగరంలో కరోనా ప్రబలడానికి కారణమేంటీ!
author img

By

Published : Jun 12, 2020, 5:59 PM IST

గాంధీనగర్... గుజరాత్ రాజధాని. ఆ రాష్ట్రంలో ఉన్న 8 మెట్రో నగరాల్లో చాలా చిన్నది. కేవలం 3 లక్షల జనాభా ఉన్న ఈ చిన్న మున్సిపల్ కార్పొరేషన్​లో కరోనా కేసులు మాత్రం గణనీయంగా పెరుగుతున్నాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే గాంధీనగర్ ఆ రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉంది. గాంధీనగర్​లోని గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 259 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 17 మంది మృత్యువాతపడ్డారు. పట్టణ ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య 143 కాగా.. ముగ్గురు వైరస్​కు బలయ్యారు.

అహ్మదాబాద్​ నగరానికి భౌగోళికంగా దగ్గరగా ఉండటం వల్ల గాంధీనగర్​లో కరోనా భయాలు మొదటి నుంచే అధికంగా ఉన్నాయి. దుబాయి నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​గా తేలడం, అనంతరం నగరంలో 14 కేసులు బయటపడటం వల్ల ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికీ గాంధీనగర్​లో భారీ సంఖ్యలో కరోనా కేసులు బయటపడుతూనే ఉన్నాయి.

మార్చి 18న తొలి కేసు

దుబాయి నుంచి వచ్చిన ఉమాంగ్​ పటేల్​కు కరోనా పరీక్షల్లో పాజిటివ్​గా తేలింది. గాంధీనగర్ జిల్లాలో నమోదైన తొలి కేసు ఇదే. అనంతరం అతని కుటుంబ సభ్యులు, బంధువులకు పరీక్షలు చేయగా.. మొత్తం 11 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. దీంతో గాంధీనగర్​ను రెడ్​జోన్​గా ప్రకటించారు.

సరిహద్దులు బంద్!

ఆస్పత్రిలో చేరిన 32 రోజుల తర్వాత గాంధీనగర్​కు చెందిన తొలి కరోనా బాధితుడు వైరస్​ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యాడు. ఓ దశలో కరోనా బాధితులు లేని ప్రాంతంగా గాంధీనగర్ అవతరించింది. అయితే అహ్మదాబాద్​ నుంచి నిరంతరం ప్రజల రాకపోకలు సాగించడం రాజధాని నగరానికి శాపంగా మారింది. కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్​కు చెందిన ప్రతిపక్ష నేత శైలేంద్ర సింగ్ బిహోలా పరిస్థితిని వివరిస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. దీంతో ఒక్క సీహెచ్​ రోడ్​ మినహా గాంధీనగర్ సరిహద్దులన్నీ మూసేశారు అధికారులు.

తొలి మరణం

గాంధీనగర్​లో తొలి కరోనా బాధితుడు ఉమాంగ్ పటేల్ తాత (82ఏళ్లు) వైరస్​కు బలయ్యాడు. సెక్టార్ 29లో నివసించే ఆయనను గాంధీనగర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడే ప్రాణాలు విడిచాడు. నగరంలో సంభవించిన తొలి వైరస్ మరణం ఇదే. మరోవైపు గాంధీనగర్ కొలవడా గ్రామానికి చెందిన 52 ఏళ్ల మహిళ సైతం మహమ్మారి బారిన పడి మరణించింది.

కలెక్టర్ ఆదేశాలు

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గాంధీనగర్ కలెక్టర్ రెండు ఉత్తర్వులు జారీ చేశారు. తొలి ఉత్తర్వులో కూరగాయలు, కిరాణా సరకులు సహా ఇతర అత్యవసర సేవలను లాక్​డౌన్ నుంచి మినహాయించారు.

కేసుల ఉద్ధృతి నియంత్రణలోకి రాకపోవడం వల్ల వీటిపైనా షరతులు విధించారు. మెడికల్ స్టోర్లు, పాల కేంద్రాలను మాత్రమే లాక్​డౌన్​ నుంచి మినహాయిస్తున్నట్లు రెండో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గాంధీనగర్ నుంచి కలోల్ టౌన్, దహేగాం, మానస మున్సిపాలిటీలకు లాక్​డౌన్​ను విస్తరించారు.

ఈ ప్రాంతాల్లోనే అధికం

గాంధీనగర్, కలోల్, దహేగావ్, మానస ప్రాంతాల్లోనే ప్రధానంగా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో మొత్తం 259 కరోనా పాజిటివ్ కేసులను గుర్తించారు. ఇందులో 101 కేసులు, 6 మరణాలు గాంధీనగర్​కు చెందినవి కాగా.. దహేగావ్​లో 32 కేసులు, 5 మరణాలు, మానసలో 26 కేసులు, ఒక మరణం, కలోల్​లో 100 కేసులు, ఐదు మరణాలు సంభవించాయి.

గాంధీనగర్​లోని మొత్తం 30 సెక్టార్లకు వైరస్ వ్యాపించింది. ఈ సెక్టార్లలో మొత్తం 146 కేసులు, 4 మరణాలు సంభవించాయి. 102 మంది బాధితులు కోలుకున్నారు.

ప్రభుత్వ వైఫల్యమేనా...!

గాంధీనగర్​లో కాలుష్యం తక్కువగానే ఉంటుంది. ఇళ్లు, సెక్టార్ల మధ్య దూరం అధికంగా ఉంటుంది. అయినప్పటికీ.. గాంధీనగర్ కరోనా హాట్​స్పాట్​గా అవతరించింది. అధికారులు సరైన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టి ఉంటే నగరంలో ఇన్ని కరోనా కేసులు ఉండేవి కావన్నది నిపుణుల అభిప్రాయం.

రాష్ట్ర ప్రభుత్వం సైతం సెక్రెటేరియట్​ను తెరిచే ఉంచడం కేసుల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. డిజిటల్ యుగంలోనూ ప్రతి రోజు ప్రభుత్వం నాలుగు ప్రెస్ కాన్ఫరెన్స్​లు నిర్వహిస్తూ వచ్చింది. ఉదయం 10 గంటలకు వైద్య శాఖ కార్యదర్శి జయంతి రవి, మధ్యాహ్నం 2 గంటలకు సీఎంఓ అధికారి అశ్వినీ కుమార్, 3.30 గంటలకు డీజీపీ, రాత్రి 7.30 గంటలకు జయంతి రవి రెండోసారి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించేవారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్​ నుంచి సెక్రెటేరియెట్​కు వచ్చే వారి సంఖ్య పెరిగిపోయింది.

అహ్మదాబాద్​ నుంచి నిరంతరంగా వస్తున్న ప్రజలను నియంత్రించడంలో అధికారుల వైఫల్యమే గాంధీనగర్​ను కరోనా హాట్​స్పాట్​గా మార్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.