దిల్లీలోని జామియాలో జరిగిన కాల్పుల ఘటనపై స్పందించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. అధికార పార్టీ అండదండలతోనే ప్రజలపై కాల్పులు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ.. మీరూ హింస వైపా? అహింస వైపా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
"దిల్లీ ఎన్నికల ప్రచారంలో భాజపా మంత్రులు, నాయకులు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినప్పుడు ఇలాంటి ఘటనలే జరుగుతాయి. దిల్లీని ఏ విధంగా మార్చాలని కోరుకుంటున్నారో ప్రధాని నరేంద్రమోదీ సమాధానం చెప్పాలి? ప్రధాని అభివృద్ధి వైపు నిలబడతారా? అరాచకత్వం వైపా?"
- ప్రియాంక గాంధీ ట్వీట్.
రాహుల్ స్పందన...
జామియా ఘటనలో సీఏఏ నిరసనకారులపై కాల్పులు జరపమని నిందితుడికి ఎవరు డబ్బులు ఇచ్చారని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ సూక్తిని పోస్ట్ చేశారు.
-
“I cannot teach you violence, as I do not believe in it. I can only teach you not to bow your heads before anyone, even at the cost of your life.”
— Rahul Gandhi (@RahulGandhi) January 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
-Mahatma Gandhi pic.twitter.com/wHIdlgtAji
">“I cannot teach you violence, as I do not believe in it. I can only teach you not to bow your heads before anyone, even at the cost of your life.”
— Rahul Gandhi (@RahulGandhi) January 30, 2020
-Mahatma Gandhi pic.twitter.com/wHIdlgtAji“I cannot teach you violence, as I do not believe in it. I can only teach you not to bow your heads before anyone, even at the cost of your life.”
— Rahul Gandhi (@RahulGandhi) January 30, 2020
-Mahatma Gandhi pic.twitter.com/wHIdlgtAji
"హింసను చేయమని నేను చెప్పను. ఎందుకంటే నేను దానిని నమ్మను. ప్రాణం పోతున్నప్పటికీ నువ్వు ఎవరి ముందు తలవంచవద్దని మాత్రమే చెబుతాను." అనే మహాత్మాగాంధీ సందేశాన్ని పోస్ట్ చేశారు రాహుల్.
కాల్పులు...
గురువారం మధ్యాహ్నం జామియా వద్ద ఓ దుండగుడు తుపాకీతో సీఏఏ నిరసనకారులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ విద్యార్థికి గాయాలయ్యాయి.
ఇదీ చదవండి: 'జైలుకు వెళ్లకపోతే.. రాజకీయ నాయకుడివి ఎలా అవుతావు'