ETV Bharat / bharat

కరోనా రిస్క్​ ఎక్కడ ఎక్కువ? ఎక్కడ తక్కువ?

రెండు నెలల నుంచి ఇంట్లో ఉండటానికి ఇబ్బంది పడ్డ ప్రజలు.. ఇప్పుడు బయటకు వెళ్లడానికి భయపడాల్సి వస్తోంది. లాక్​డౌన్​లో బలవంతంగా ఒకే చోట ఉన్న జనం.. ఇప్పుడు స్వచ్ఛందంగానే ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఎంతకాలం ఇంట్లోనే ఉండగలం? బతుకు బండి సాగించాలంటే బయటకెళ్లాల్సిందే. మరి ఈ పరిస్థితుల్లో మనల్ని మనం సురక్షితంగా ఉంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? నిపుణులు ఏం సూచిస్తున్నారు?

What we now know about how you can catch COVID-19
కరోనా రిస్క్​ ఎక్కడ ఎక్కువ? ఎక్కడ తక్కువ?
author img

By

Published : Jun 26, 2020, 5:55 PM IST

Updated : Jun 26, 2020, 6:05 PM IST

లాక్​డౌన్ దాదాపు పూర్తయ్యింది. రద్దీ రహదారులు, వీధుల్లో పెద్ద ఎత్తున జనం, వాణిజ్య సముదాయాల్లో కిటకిట, భారీ ట్రాఫిక్... ఇవన్నీ మళ్లీ తిరిగొచ్చినట్లే! క్రమంగా సాధారణ జీవితం ప్రారంభమైనట్లే కనిపిస్తోంది. కానీ, ప్రస్తుతం సాధారణ జీవితమే భయానకంగా మారింది. కరోనా మహమ్మారి నుంచి రక్షించుకునే బాధ్యత ప్రజలపైనే పడిపోయింది. దీంతో ప్రజల్లో వైరస్ భయం పెరిగిపోయింది. బయటకు వెళ్తే ఎక్కడ కరోనా అంటుకుంటుందోనని బెంబేలెత్తిపోతున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడదు కాబట్టి బయటకు వెళ్లకుండా అసలు ఉండలేము.

మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఎక్కడ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటోంది? ఆ ప్రదేశాలకు వెళ్లకుండా మనల్ని మనం నియంత్రించుకునేదెలా?

వైరస్ విజృంభణకు 3 కారణాలు

  • ఎక్కువగా జనాలు తిరిగే ప్రదేశాలు
  • సరిగా వెంటిలేషన్ లేని ప్రాంతాలు
  • బహిరంగ ప్రదేశాల్లో గట్టిగా మాట్లాడే వ్యక్తులు

ఈ మూడు కారణాల వల్ల కరోనా వ్యాప్తి అధికంగా ఉంటున్నట్లు పరిశోధనలు నొక్కి చెబుతున్నాయి.

ముక్కు, నోరు ద్వారా బయటకు వచ్చిన తుంపర్లే కొవిడ్-19 వ్యాప్తికి ప్రధాన కారణమని చాలా పరిశోధనలు ఇప్పటికే స్పష్టం చేశాయి. పెద్దపెద్ద తుంపర్లు నేరుగా వేరొకరి కళ్లు, ముక్కు, నోటిలోకి చేరితే ఒకరి నుంచి మరొకరికి కరోనా సోకుతుందని తేల్చాయి. కానీ ఈ తుంపర్లు గాలిలో ఎక్కువసేపు ఉండకుండా నేలపై పడిపోతాయి. అయితే చిన్న చిన్న తుంపర్లు ఎక్కువ కాలం గాలిలో ఉంటాయని.. వీటిని నేరుగా పీల్చడం ద్వారా కరోనా సోకే ప్రమాదం ఉందని మరికొన్ని పరిశోధనలు వెల్లడించాయి.

గాలి ప్రసరణే ముఖ్యం

ఈ రకంగా వైరస్​ వ్యాప్తి జరగకుండా అరికట్టాలంటే ప్రతి చోట వెంటిలేషన్ సరిగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పని ప్రదేశాలతో పాటు మనం ఎక్కువగా సందర్శించే ప్రాంతాల్లో సరిగ్గా గాలి ఆడేలా చూసుకోవడం చాలా ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు.

కరోనా సోకిన వ్యక్తితో ఎక్కువసేపు గడపడం వల్ల ఇతరులు వైరస్ బారిన పడే అవకాశం ఉందని చెబున్నారు. ఆరు అడుగుల కన్నా తక్కువ దూరం పాటిస్తూ, 15 నిమిషాల కన్నా ఎక్కువ సమయం రోగితో గడిపితే వైరస్ వ్యాప్తి ప్రమాదం పెరుగుతుందని... అంతకన్నా తక్కువ సమయంలోనూ వైరస్ సోకే అవకాశం ఉందని తేల్చి చెబుతున్నారు.

కేవలం 10 శాతం మంది ప్రజలే 80 శాతం వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నట్లు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. సరైన వెంటిలేషన్ లేని ప్రదేశాల్లో కరోనా రోగులు ఉండటం వల్ల ఇతరులకు వేగంగా వ్యాపిస్తోందని స్పష్టమైంది.

ఎటాక్ రేటు

నిర్దిష్ట సమయం, ప్రాంతంలో వైరస్ బారిన పడ్డ ప్రజల రేటు(ఎటాక్ రేటు) జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో అధికంగా ఉంటోందని పరిశోధకులు స్పష్టం చేశారు. ఎక్కువ మంది ఉండే కార్యక్రమాలు, ఇళ్లలో ఈ సంఖ్య గరిష్ఠంగా ఉంటున్నట్లు తెలిపారు. అందువల్ల తగిన దూరం పాటించాలని పదేపదే చెబుతున్నారు.

చైనాలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం గృహ సముదాయాల్లో ఎటాక్ రేటు 4.6 శాతం నుంచి 19.3 శాతం వరకు ఉంటుందని పరిశోధకులు తేల్చారు. జీవిత భాగస్వాముల్లో అత్యధికంగా 27.8 శాతం ఉన్నట్లు స్పష్టం చేశారు.

వైరస్ ఎంత ఉండాలి?

ఇతరులకు వ్యాపించాలంటే ఈ వైరస్ ఎంత మోతాదులో ఉండాలన్న విషయంపై స్పష్టమైన ఆధారాలేవీ లేనప్పటికీ.. రోగి గొంతులోని ఒక మిల్లీలీటర్ కఫంలో పది లక్షల వైరల్ ఆర్​ఎన్​ఏలు ఉంటేనే ఇది సాధ్యమవుతుందని పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. వైరస్ సోకిన రోగుల్లో ఈ సంఖ్య వెయ్యి రెట్లు అధికంగా ఉందని గుర్తించాయి.

నాలుగు గోడల గదితో పోలిస్తే బహిరంగ ప్రదేశాల్లోనే వైరల్ కణాలు త్వరగా నశిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రజలు వ్యక్తిగత దూరం నిబంధనలు విస్మరిస్తే.. ఈ ప్రదేశాల్లోనే కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.

లాక్​డౌన్ పరిష్కారం కాదు

లాక్​డౌన్ గురించి ఎక్కువగా ఆలోచించకూడదని నిపుణులు ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. దానికి బదులుగా భౌతిక దూరాన్ని పాటించే చర్యలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వినూత్న మార్గాలు అనుసరిస్తూ ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించాలని చెబుతున్నారు.

టెస్టులను ఎక్కువగా నిర్వహించాలని పునరుద్ఘాటిస్తున్నారు. వైరస్ సోకిన వారిని ఐసోలేషన్​లో ఉంచడం వల్ల కరోనాను అడ్డుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు.

ఇవీ చదవండి

Last Updated : Jun 26, 2020, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.