ETV Bharat / bharat

'లింగ సమానత్వం'లో ఒంటిరెక్క పక్షిలా ఎంతకాలం? - మహిళా సాధికారత ఎక్కడ

పురుషాధిక్య సమాజంలో స్త్రీపురుష సమానత్వం ఎండమావేనని మరోసారి రుజువైంది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్​) తాజా నివేదిక ఈ చేదు నిజాన్నే రుజువుచేస్తోంది. నిరుడు 108వ స్థానంలో ఉన్న భారత్‌ నేడు మరో నాలుగు స్థానాలు కోల్పోయి మొత్తం 153 దేశాల జాబితాలో 112వ స్థానానికి దిగజారడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

what about Gender equality is india and world
ఒంటిరెక్క పక్షిలా ఎంతకాలం?
author img

By

Published : Dec 19, 2019, 8:47 AM IST

శక్తిస్వరూపిణి అయిన దేవతామూర్తిగా స్త్రీని ఆలయాల్లో ప్రతిష్ఠించి అనునిత్యం పూజలు చేసి కైమోడ్పులు అర్పించే సంస్కృతి మనది. నిజజీవితంలో తరాల తరబడి నరనరాల్లో జీర్ణించుకుపోయిన పురుషాధిక్య భావజాలం దేశవ్యాప్తంగా ఆడవారిని అబలలుగా జమకట్టి వారి ప్రగతి కాంక్షలకు నిర్దయగా గోరీ కట్టేస్తోంది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) వెలువరించిన తాజా నివేదిక ఆ చేదు నిజాలకే అద్దం పట్టింది.

నానాటికీ దిగజారుతున్న వైనం..

స్త్రీ పురుష సమానత్వంపై ప్రపంచ ఆర్థిక వేదిక తొలిసారి 2006లో నివేదిక సమర్పించినప్పుడు సంబంధిత సూచీల్లో ఇండియా 98వ స్థానంలో నిలిచింది. దరిమిలా ‘నానాటికి తీసికట్టు నాగంభొట్టు’ చందంగా పరిస్థితి దిగజారుతోంది. నిరుడు 108వ స్థానంలో ఉన్న భారత్‌ నేడు మరో నాలుగు స్థానాలు కోల్పోయి మొత్తం 153 దేశాల జాబితాలో 112వ స్థానంలో నిలిచిందని విశ్లేషణలు చాటుతున్నాయి. మహిళల ఆరోగ్య భద్రత, ఆర్థిక భాగస్వామ్యం- అత్యంత కీలకమైన ఈ రెండు అంశాల్లో ఇండియా అట్టడుగున అయిదు స్థానాల్లో కునారిల్లుతోంది. ఆదాయపరంగా 144, చట్టసభలకు ప్రాతినిధ్యంలో 122, విద్యార్హతలు పొందడంలో 112 స్థానాలకు పరిమితమైన భారత మహిళాలోకం ఇప్పటికీ ఎంతగా సామాజిక ఆంక్షల పరిమితుల చట్రంలో ఒదిగిపోతున్నదో నివేదిక చాటుతోంది. ఇస్లామిక్‌ దేశమైన బంగ్లాదేశ్‌ స్త్రీ సాధికారత పరంగా 50వ స్థానంలో ఉంటే, అగ్రరాజ్యమైన అమెరికా రెండు అంచెలు దిగజారి ఈసారి 53వ స్థానానికి పరిమితం కావడం విశేషం. ప్రబలార్థిక శక్తిగా ఎదిగిన జపాన్‌ నేటికీ సంప్రదాయ శృంఖలాల్లో స్త్రీలను బంధించి 119వ స్థానంలో కొట్టుమిట్టాడుతుండటం గమనార్హం. స్త్రీ సమానత్వ సూచీలో ఎదుగూబొదుగూ లేకుండా 48 దేశాలు కొనసాగుతున్న సమకాలీన ప్రపంచంలో- ప్రస్తుత తరం తమ జీవితకాలంలో లింగభేదాల్లేని సమాజాన్ని చూడలేదని, ఆ సమున్నతాదర్శం సాకారం కావడానికి దాదాపు వందేళ్లు పడుతుందని ప్రపంచ ఆర్థిక వేదిక చెబుతోంది. ఆరోగ్య సేవల్ని అందరికీ అందించడంలో గుణాత్మక ప్రగతి కనిపిస్తున్నా రాజకీయ, ఉద్యోగ విపణుల్లో మహిళల భాగస్వామ్యాన్ని ఇతోధికం చెయ్యడంలో సరైన అడుగులు పడటంలేదన్న హెచ్చరిక ఇండియాలో పరిస్థితులకూ వర్తిస్తుంది!

లింగ సమానత్వం?

ఐక్యరాజ్య సమితి 2030నాటికి సాధించదలచిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో అయిదో అంశంగా లింగసమానత్వం కొలువుతీరింది. మహిళల హక్కులంటే మానవ హక్కులేనన్న 1995నాటి బీజింగ్‌ ప్రకటన స్ఫూర్తిని నేటికీ పూర్తిగా ప్రపంచ దేశాలు ఒంట పట్టించుకోలేకపోవడంతో అసమానతల అగాధంలో ‘ఆకాశంలో సగం’ కూరుకుపోతోంది. ఆరోగ్యం, విద్య, ఆర్థికం, రాజకీయం- కీలకమైన ఈ ప్రాతిపదికల ఆధారంగా లింగపరమైన అసమానతల్ని దేశాలవారీగా వేలెత్తిచూపిన ప్రపంచ ఆర్థిక వేదిక, స్త్రీ పురుష సమానత్వ సాధనకు దక్షిణాసియాకు దాదాపు 72 ఏళ్లు పడుతుందని లెక్కగట్టింది. ప్రపంచవ్యాప్తంగా 35,127 పార్లమెంటరీ సీట్లలో 25 శాతం, మంత్రిపదవులు మొత్తం 3,343లో 21 శాతం మహిళలున్నా, స్త్రీ సాధికారత కోసం ఇండియా వంటి దేశాలు చేయాల్సింది మరెంతో ఉందన్న సత్యం కళ్లకు కడుతూనే ఉంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పుణ్యమా అని పునాది స్థాయి రాజకీయాధికారంలో స్త్రీల వాటా కంటికి నదరేగాని, చట్టసభల్లో మూడోవంతు కోటాకు అన్ని పక్షాలూ మొహం చాటేస్తున్న వైనం దేశీయంగా దుర్విచక్షణకు తిరుగులేని దృష్టాంతం. దశాబ్దకాలంలో భారత్‌ స్థూల దేశీయోత్పత్తి ఆరు శాతం దాకా పెరిగినా, శ్రామిక శక్తిలో మహిళల వాటా 34 నుంచి 27 శాతానికి పడిపోయింది. స్త్రీ పురుషుల జీతనాతాల్లో వ్యత్యాసమూ 50 శాతంగా నమోదవుతోంది. ఆడపిల్లను ‘మైనస్‌’గా పరిగణించే దౌర్భాగ్యం లింగనిష్పత్తిని ప్రభావితం చేస్తుంటే, తమ భవిష్యత్తుకు తామే బ్రహ్మలుగా దూసుకొస్తున్న అమ్మలకు సామాజికంగా ఎదురవుతున్న పీడన- మొత్తంగా దేశ ప్రగతినే దిగలాగుతోంది!

మహిళా సాధికారిత సాధ్యమేనా?

అవతారిక, ప్రాథమిక హక్కులు బాధ్యతలు, ఆదేశిక సూత్రాలన్నింటా లింగసమానత్వాన్ని ప్రబోధించిన భారత రాజ్యాంగం- మహిళల స్థితిగతుల మెరుగుదలకు ప్రత్యేక చొరవ కనబరచే అధికారాన్ని ప్రభుత్వాలకు కట్టబెట్టింది. అయిదో పంచవర్ష ప్రణాళిక (1974-78) నుంచి పంథా మార్చిన ప్రభుత్వాలు స్త్రీ సంక్షేమం స్థానే అభివృద్ధి పథకాలకు పాదుచేస్తూ వచ్చాయి. సమాజంలో మహిళల స్థాయి నిర్ధారణకు సాధికారతనే మౌలిక సూత్రంగా సర్కార్లు రెండు దశాబ్దాలనుంచి పరిగణిస్తున్నాయి. స్త్రీలపై అన్ని రకాల దుర్విచక్షణకు భరతవాక్యం పలకాలన్న 1993నాటి అంతర్జాతీయ ఒడంబడికను ఇండియా ఔదలదాల్చినా, దేశీయంగా 2001లో మహిళా సాధికారతకు జాతీయ విధానాన్నే రూపొందించినా- ప్రవచిత లక్ష్యాలకు దీటుగా ముందడుగు పడనేలేదు. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికల్ని కొత్తపుంతలు తొక్కించేందుకు 2016లో జాతీయ విధాన ముసాయిదా వెలుగుచూసినా అదింకా అమలులోకి రానేలేదు. దేశ జనాభాలో సగంగా ఉన్న స్త్రీలు సహజసిద్ధ ప్రతిభావ్యుత్పన్నతలకు సాన పట్టుకొని నిపుణ శ్రామిక శక్తిగా ఎదిగివస్తే వర్ధమాన దేశంగా అంగలారుస్తున్న భారతావని జాతకం కళ్లు జిగేల్మనేలా మారిపోతుందనేది నిర్ద్వంద్వం. ఇండియా లింగ సమానత్వాన్ని సాధించగలిగితే 2025 నాటికి స్థూలదేశీయోత్పత్తికి ఏకంగా 70 వేలకోట్ల డాలర్ల సంపద అదనంగా జమపడుతుందన్న మెకిన్సే అంచనా- మన వెనకబాటుకు మూలకారణాన్ని ఎత్తిచూపుతోంది. ఒంటిరెక్కతో ఏ పక్షీ ఎగరలేనట్లే, జనాభాలో సగంగా ఉన్న స్త్రీశక్తిని సమర్థ మానవ వనరుగా సద్వినియోగం చేసుకోకుండా ఏ జాతీ పురోగమించలేదన్న వాస్తవాన్ని విధానకర్తలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది!

ఇదీ చూడండి: 'సుదీర్ఘ తీర్పు కాదు.. స్పష్టత ముఖ్యం'

RESTRICTIONS SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS- AP CLIENTS ONLY
Belo Monte - 6 September 2019
1. Various of drone video of Belo Monte dam ++MUTE++
2. Close-up of dam
3. Various of boat passing by dam
4. Pan left from Belo Monte to Xingu River
5. Wide of river, trees
6. Various of Elgino Nunes Trindade, fisherman, cutting a fish in the riverside
7. Trindade talking to a friend; UPSOUND (Portuguese): "The situation is difficult."
8. SOUNDBITE (Portuguese) Elgino Nunes Trindade, fisherman:
"The place where the dam is located, that was the place where we used to fish but you don't catch anything else there. They 'cleaned' the area where we used to fish and that was it (meaning there was no more fish). There is another place, down, called Santa Helena where we also used to fish but there was a decrease in the number of fish. You can talk with a lot people here, before the dam we fished a lot of fish."
9. Various drone video of Trindade seated near the river next to his boats and his house ++MUTE++
10. Trees and bushes on riverside (filmed from a boat)
11. Wide of power towers near river and a house
12. Pan right from river to Jair Teixeira da Costa, fisherman, on his boat
13. Various of dogs (that belong to da Costa) swimming in the river, Da Costa on his boat arriving at his property
14. Tilt-up from dogs to Da Costa playing with them
15. SOUNDBITE (Portuguese) Jair Teixeira da Costa, fisherman:
"Even when we live close to Brazil's largest energy (hydroelectric dam), we don't have energy. The work is done and we are waiting to see if they bring the energy to us.
(journalist: "and how do you make your living?")
I fish, but 'fighting,' now I have to do many gigs, (other jobs) things to survive."
ASSOCIATED PRESS- AP CLIENTS ONLY
Altamira - 5 September 2019
16. Wide of a sign reading (Portuguese) "I love Altamira" near Xingu river
17. Various of boats passing
ASSOCIATED PRESS- AP CLIENTS ONLY
Altamira - 6 September 2019
18. Mid of houses, Xingu river in background
19. Wide of houses built for people resettled after dam's construction
20. Various of people on street
21. Setup of Edizangela Alves Barros, resident and member of the group 'Movement of those affected by dams'
22. SOUNDBITE (Portuguese) Edizangela Alves Barros, resident, member of the group 'Movement of those affected by dams':
"We were expecting to live better than how we were living before, but what we see today is not what we expected, it's not the promised development for us to live better. What we see today after Belo Monte, after five years, we see a municipality that is in the top ranking for violence, the most violent in Brazil. We live in a situation of a lack of security and unemployment. Today the families don't have jobs."
ASSOCIATED PRESS- AP CLIENTS ONLY
Altamira - 7 September 2019
++MUTE++
23. Various drone video of houses built to resettle people living in the region where the dam was built
ASSOCIATED PRESS- AP CLIENTS ONLY
Rio de Janeiro - 18 December 2019
24. Setup of Adriana Abdenur, researcher at Igarape Institute
25. SOUNDBITE (English) Adriana Abdenur, researcher at Igarape Institute:
"The legacy of Belo Monte for the local populations and the region as a whole is extremely negative because when you have such a megalomaniac infrastructure project, you provide access to vast numbers of people who move to the region and who then find themselves in positions of underemployment or unemployment and who end up having to resort to illegal activities, such as illegal logging, such as illegal mining – especially of gold - and other activities that can even include drug trafficking. So you create a space within the Amazon in which the state presence is very weak, impunity is very high and criminal activity is absolutely rampant and so we see this not only in the unemployment rates but also in the homicides rates, Altamira is currently the second most violent city in all of Brazil."
ASSOCIATED PRESS- AP CLIENTS ONLY
Paracambi, Rio de Janeiro State - 4 December 2019
26. Various of power towers near Xingu Rio's substation
27. Pan right from towers to substation
28. Various of 'valve hall,' where direct current (DC) power from Belo Monte is converted and filtered to alternating current (AC) power
29. Wide of sign outside substation reading (Portuguese) "Xingu Rio"
ASSOCIATED PRESS- AP CLIENTS ONLY
Rio de Janeiro - 5 December 2019
30. Various of Anselmo Leal, Vice President at State Grid Holding Brazil
31. SOUNDBITE (Portuguese) Anselmo Leal, Vice President at State Grid Holding Brazil:
"Our strategy was to anticipate and increase the dialogue (with the people affected by the construction of the line from Belo Monte to Rio de Janeiro). We had 'communicators' in all of the lines talking with the communities during the work, because those close communities are the ones that see (feel) the work. Those living from Rio de Janeiro to the dam don't 'see' (realise) what building 5,000 structures through Brazil means."
ASSOCIATED PRESS- AP CLIENTS ONLY
Rio de Janeiro - 17 December 2019
++DUSK SHOTS++
32. Various of sunset, buildings, water
33. Christ the Redeemer statue
STORYLINE:
Edizangela Alves Barros believed that being forced to relocate to make way for a mammoth dam in Brazil's Amazon would mean a brighter future for her family.
Instead, their newly built settlement has more expensive electricity bills and intermittent public lighting -- a cruel irony for a community just 40 kilometers (25 miles) from the world's third-biggest hydroelectric dam.
"We left our wooden houses to live in concrete houses, but our economic situation got worse," Alves Barros, a mother of five, said in an interview.
She used to live by the Xingu River.
Today, it is the site of the Belo Monte dam, a colossus built with enough concrete and steel to make 22 Eiffel Towers.
Boats crossing the river beside it look like toys.
Belo Monte was conceived to bolster Brazil's faltering electrical grid.
And three weeks into full operation, the dam has been a boon — at least to the people in cities more than 2,400 kilometers (1,500 miles) away.
There is a different view in the region where the dam was built.
The project displaced some 40,000 people, according to civil society estimates, and it has dried up stretches of the Xingu River.
Sitting in the northern state of Para, Belo Monte has the capacity to generate 11.2 gigawatts of power, less only than China's Three Gorges and Itaipu on Brazil's border with Paraguay.
It required excavating a canal larger than the Panama Canal.
Entrepreneurs saw opportunity, and job seekers flocked to Altamira seeking one of the 60,000 promised positions, which sent the city's population surging.
Residents who fished and bathed in the Xingu saw their lives take a dramatic turn.
One was Jair Teixeira da Costa, a fisherman who lives in a small wooden house with a makeshift dock where he plays with his six dogs.
Today, fish are scarce and he picks up odd jobs to make ends meet.
That isn't what he expected after hearing the plans outlined by the dam's builder for preserving local communities' customs.
Federal prosecutors have carried out 27 different investigations focused on Belo Monte.
Among other things, they have accused companies and public agencies of not performing mandatory consultations with indigenous communities, or not fulfilling pledges to implement basic sewage for area residents.
In an email to The Associated Press, Norte Energia said local families eat more than three times the amount of fish suggested by the World Health Organization, and stressed that they had created a "cooperative" of fishermen to mitigate impacts on the river.
Norte Energia also said it did not force indigenous communities to relocate.
A world away, in Rio de Janeiro, beachgoers on Ipanema applaud the sunset every evening.
Lights come on across the city, illuminating the Christ the Redeemer statue, the Maracana soccer stadium and homes of 13 million city dwellers.
Few Rio residents realize their televisions and washing machines draw some power from the distant mega-dam. Recently, Belo Monte has been sending power along the world's longest 800 kilovolt transmission line, which snakes for 2,534 kilometers (1,574 miles) through 81 cities and three ecosystems to a substation in Rio state.
The line to Rio state isn't a straight shot.
The local subsidiary of a Chinese state-owned company built it with 435 kilometers (270 miles) of detours to avoid crossing indigenous land and keep local communities on board, said Anselmo Leal, Vice President at State Grid Holding Brazil.
The company also raised towers above tree-level to avoid cutting down a 120 yard-wide strip of forest along the way.
Transmission line construction was impeded by 2017 protests in Para state, and Brazil's government deployed National Guard troops to ensure no delays in work that was considered essential for growth of the country's economy.
Brazil suffered big blackouts before 2010, some of them caused by faults at power plants.
In 2009, a power failure threw Brazil's two largest cities into darkness, affecting millions.
Altamira's population has surged 48%, to 115,000 people from 77,000 in 2000.
The loss of jobs brought by the dam's construction fueled an explosion in violence, experts believe.
In 2008, before construction began, Altamira's homicide rate was 36 per 100,000 residents.
By 2018, the rate almost quadrupled, making it Brazil's second-most violent city.
Hotels built to accommodate the once-booming workforce are empty, many small local companies have shuttered, and larger firms are caught up in the sprawling "Car Wash" corruption probe that revealed bribery in Brazil's construction sector.
In November, President Jair Bolsonaro unveiled the inaugural plaque on Belo Monte's final turbine, #18, and the dam began full operation.
Still, maximum generation is lacking given low rainfall roughly half the year.
That being the case, the company that operates the dam, Norte Energia, is evaluating construction of a natural gas-fired power plant on the site, the newspaper Estado de S. Paulo reported last week.
Norte Energia told The Associated Press in an emailed response only that it is developing projects to expand the power sector, without providing details.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.