కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటం వల్ల బంగాల్ ప్రభుత్వం మరోమారు లాక్డౌన్ బాట పట్టింది. వారంలో రెండు రోజుల పాటు పూర్తిస్థాయి లాక్డౌన్ విధించాలని దీదీ సర్కారు నిర్ణయించింది.
ఈ వారం నుంచే లాక్డౌన్ విధానాన్ని ప్రారంభించనున్నట్లు బంగాల్ హోంశాఖ కార్యదర్శి అలపాన్ బంద్యోపాధ్యాయ్ వెల్లడించారు. ప్రస్తుత వారంలో గురు, శనివారాల్లో లాక్డౌన్ అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సామాజిక వ్యాప్తి నమోదైనట్లు తెలిపారు.