పశ్చిమ్ బంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే సువేందు అధికారి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు మరో కేబినెట్ మంత్రి రాజీవ్ బెనర్జీ కూడా పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మమతకు, గవర్నర్‌కు పంపారు.
రాజీవ్ బెనర్జీ బంగాల్ అటవీ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవమని, ఈ అవకాశం ఇచ్చినందుకు మమతకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు.