ETV Bharat / bharat

'ఆర్థిక మాంద్యంపై దృష్టి మళ్లించేందుకే చంద్రయాన్​'

దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యంపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రయాన్​ ప్రయోగమని ఆరోపించారు పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. చంద్రయాన్​-2 ప్రయోగంలో కీలక ఘట్టానికి కొన్ని గంటల ముందు మమత ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.

'ఆర్థిక మాంద్యంపై దృష్టి మళ్లించేందుకే చంద్రయాన్​'
author img

By

Published : Sep 6, 2019, 5:55 PM IST

Updated : Sep 29, 2019, 4:17 PM IST

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్​-2 ప్రయోగంలో కీలక ఘట్టానికి కొన్ని గంటల ముందు పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్​ ప్రయోగం దేశంలోనే తొలిసారి అయితే భాజపా అధికారంలోకి రాకముందు ఇలాంటివి చేపట్టలేదా అంటూ ప్రశ్నించారు. దేశంలో ఆర్థిక మాంద్యంపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేసిన ప్రయత్నమని ఆరోపించారు.

పశ్చిమ బంగ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన మీడియా, న్యాయవ్యవస్థ వంటివి కేంద్రం సలహాలతో నడుస్తున్నాయని ఆరోపించారు.

ఆర్థిక మాంద్యంపై మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ మాటలను తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పారు మమత. రాజకీయ విమర్శల కంటే ఆర్థిక వ్యవస్థపై ఎక్కవ దృష్టిసారించాలన్నారు.

ఎన్​ఆర్​సీని అనుమతించం..

అసోం మాదిరి జాతీయ పౌర రిజిస్టర్​ను పశ్చిమ బంగలో చేపడతామన్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు మమత. రాష్ట్రంలో ఎన్​ఆర్​సీని అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎన్​ఆర్​సీ అమలు చేయటం అనేది భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ రాజకీయ వ్యూహమని ఆరోపించారు. అసోం ఎన్​ఆర్​సీలో నిజమైన భారతీయులకు చోటు దక్కలేదని విమర్శించారు.

బ్యాంకుల విలీనం ఏకపక్షం...

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయమని ఆరోపించారు మమత. కోల్​కతా ప్రధాన కార్యాలయాలుగా నడుస్తున్న రెండు బ్యాంకులను రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా విలీనం చేయడమేంటన్నారు. బెంగాల్​ నుంచి ప్రధాన కార్యాలయాన్ని తరలించటం వల్ల రాష్ట్ర అభివృద్ధిపై ప్రభావం పడుతుందన్నారు. ఈ అంశంపై ప్రధానికి లేఖ రాశారు.

చిదంబరానికి కనీస గౌరవం ఇవ్వాలి...

కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని జ్యుడీషియల్​ కస్టడీ నిమిత్తం తిహార్​ జైలుకు తరలించడాన్ని తప్పుపట్టారు మమత. చిదంబరానికి కేంద్ర ప్రభుత్వం కనీస గౌరవం ఇవ్వాలన్నారు. ఒక సాధారణ ఖైదీలా తిహార్​ జైలుకు పంపడమేంటని ప్రశ్నించారు.

ఇదీ చూడండి: చంద్రయాన్​-2: ఒక లక్ష్యం- వెయ్యి మెదళ్లు

Intro:Body:

'

Conclusion:
Last Updated : Sep 29, 2019, 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.