అజోధ్య పర్వాతాల్లోని బమ్ని వాటర్ ఫాల్స్ చూసేందుకు స్నేహితులంతా కలిసి విహారయాత్రకు వెళ్లారు. వీళ్లంతా కాలేజీ విద్యార్థులు. జలకాలాడేందుకు జలపాతం కింద నిల్చున్నారు. కాసేపు సరదాగా గడిపారు. ఒక్క సారిగా నీటి ప్రవాహం పెరిగింది. వరదగా మారి వారిని ముంచేయబోయింది. కొందరైతే ఎలాగోలా సురక్షిత ప్రదేశాలకు చేరుకున్నారు కానీ, ఇద్దరు మాత్రం వరద తీవ్రతను ఎదురించలేక అక్కడున్న రాళ్ల వెనకే చిక్కుకున్నారు.
ఎంత సేపటికీ జలపాతంలో ప్రవాహం తగ్గకపోయేసరికి వారిద్దరి పరిస్థితిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు చాలా సేపు శ్రమించి ఇద్దరినీ రక్షించారు.