ETV Bharat / bharat

'మేం రైతులం.. ఎదురుచూపులు మాకు అలవాటే!'

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నలు చేస్తోన్న ఆందోళనలు మరింత ఉద్ధృతమవుతున్నాయి. గాజీపుర్ సరిహద్దు​కు పెద్దఎత్తున తరలివస్తున్నారు కర్షకులు. పంటల కోసం సుదీర్ఘకాలం వేచిచూసే తాము.. ఉద్యమం ఫలించే వరకూ ఎంతకాలమైనా దీక్షలు ఆపేదిలేదని తేల్చి చెబుతున్నారు. 'జై జవాన్​.. జై కిసాన్'​ నినాదాలతో ఉద్యమాన్ని హోరెత్తిస్తున్నారు.

We have to wait for months for Crops like that won't stop this movement until final: Farmers
ఎదురుచూపులు మాకు అలవాటే
author img

By

Published : Feb 1, 2021, 8:33 AM IST

అన్నదాతల ఆందోళన ఉద్ధృతమవుతోంది. గాజీపుర్‌ సరిహద్దుకు వారు పెద్దసంఖ్యలో చేరుకుంటున్నారు. పంట కోసం నెలల తరబడి ఎదురుచూసే తాము ఉద్యమ ఫలాల కోసం ఎంతకాలమైనా దీక్ష కొనసాగిస్తామని రైతులు దృఢ సంకల్పంతో చెబుతున్నారు. మేం రైతులం.. మేం సైనికులం అనే నినాదాలున్న టోపీలు ధరించి యువరైతులంతా జై జవాన్‌.. జై కిసాన్‌ నినాదాలు చేస్తున్నారు. పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌, మేరఠ్‌, ఘాజియాబాద్‌, బులంద్‌శహర్‌, మధుర, అమ్రోహా, బరేలీ, బాగ్‌పత్‌ జిల్లాల నుంచి రైతు కుటుంబాలు తమ ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో వందల సంఖ్యలో తరలివస్తున్నాయి. గడ్డ కట్టే చలిలోనూ తావూజీ (పెద్ద మామ) రాకేశ్‌ టికాయత్‌ తమ కోసం ఉద్యమం సాగిస్తుంటే గ్రామాల్లో ఉండలేక వచ్చేశామని మేరఠ్‌ జిల్లా మసూరి గ్రామానికి చెందిన యువ రైతు రాజ్‌కుమార్‌ 'ఈనాడు' ప్రతినిధికి తెలిపారు.

అంతటా వారి నామస్మరణ

యూపీ ట్రాక్టర్లు, వాహనాలకు రైతు, జాతీయ జెండాలతో పాటు మాజీ ప్రధానమంత్రి చరణ్‌సింగ్‌, బీకేయూ వ్యవస్థాపకుడు మహేంద్ర సింగ్‌ టికాయత్‌ల చిత్రాలు ఏర్పాటు చేశారు. కిసాన్‌ ఏక్తా జిందాబాద్‌... చరణ్‌సింగ్‌, మహేంద్రసింగ్‌ టికాయత్‌ అమర్‌రహే అనే నినాదాలు మిన్నంటుతున్నాయి. యువ రైతులు, వృద్ధులు రాకేశ్‌ టికాయత్‌ను కలిసి ఉద్యమానికి అండగా ఉంటామని చెబుతున్నారు. టికాయత్‌ దగ్గరకు వెళ్లే క్రమంలో తోపులాటలు చోటు చేసుకుంటుండడంతో కొందరు యువకులు ఆయనకు రక్షణగా నిలుస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు వచ్చినప్పుడు వారి గురించి పూర్తిగా తెలుసుకుంటున్నారు.

Women Farmers in Delhi protests
తరలివస్తోన్న మహిళా రైతులు

పోలీసుల బారికేడ్లు

దిల్లీ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, పాత్రికేయులు గాజీపుర్‌కు వెళ్తుండడంతో పోలీసులు పలుచోట్ల బారికేడ్లు నిర్మిస్తున్నారు. పదుల సంఖ్యలో పారామిలటరీ బలగాలు సరిహద్దులకు చేరుకుంటున్నాయి. యూపీలో భాజపా ప్రభుత్వం అధికారంలో ఉండడంతో.. అక్కడి రైతులను ఖాళీ చేయించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధైర్యం చేయలేవని మధురకు చెందిన ధర్మేంద్ర అనే రైతు తెలిపారు. గాజీపుర్‌కు వచ్చిన వారిలో 90 శాతం మంది పశ్చిమ యూపీవారు.

Ghajipur Washing machines
ఘాజీపుర్​ సరిహద్దులో జనరేటర్లతో నడుస్తోన్న వాషింగ్​ మెషీన్లు

తావూజీకి అండగా

"మేం గత రెండు ఎన్నికల్లో భాజపాకు మద్దతుగా నిలిచాం. కేంద్ర చట్టాలతో మా పరిస్థితి దారుణంగా తయారవుతుంది. వాటి రద్దుకు పోరాడుతున్న తావూజీ (రాకేశ్‌ టికాయత్‌)కి అండగా నిలుస్తాం. చట్టాలు రద్దు చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్లం."

- అభయ్‌ కాక్రాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌

బిల్‌ వాపసీ.. ఘర్‌ వాపసీ

"మేమంతా చిన్న, మధ్య తరగతి రైతులం. చట్టాలతో మేం వ్యవసాయానికి దూరమవుతాం. కేంద్ర ప్రభుత్వం చట్టాలు వెనక్కి తీసుకుంటేనే మేం ఇళ్లకు వెళతాం(బిల్‌ వాపసీ.. ఘర్‌ వాపసీ)."

- జశ్వంత్​ ‌సింగ్‌, ఘాజియాబాద్‌, యూపీ

జనరేటర్లు.. సంచార మరుగుదొడ్లు..

విద్యుత్తును, తాగునీటిని ఉత్తర్‌పదేశ్‌ ప్రభుత్వం నిలిపివేయడంతో రైతులు తెచ్చిన జనరేటర్లతో వాషింగ్‌ మెషిన్లు, మిక్సీలు నడిపిస్తున్నారు. దిల్లీ ప్రభుత్వం రైతుల కోసం సంచార మరుగుదొడ్లు ఏర్పాటు చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌ రైతులు బియ్యం, గోధుమలు, కూరగాయలు, పాలు, పండ్లు వంటివి ట్రాక్టర్లలో తీసుకువస్తున్నారు. సింఘు సరిహద్దులో మాదిరే ఎన్ని రోజులైనా తాము ఇక్కడ తమ వారికి ఆహారం ఉచితంగా అందిస్తామని యువ రైతులు చెబుతున్నారు.

Ghajipur Toilest
దిల్లీ ప్రభుత్వం ఘాజీపుర్​ సరిహద్దులో ఏర్పాటుచేసిన సంచార మరుగుదొడ్లు

సోదరులకు మద్దతుగా..

"మాది ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌శహర్‌. మావన్నీ రైతు కుటుంబాలే. మేం చిన్నచిన్న పనులు చేస్తూ కొన్నాళ్లుగా దిల్లీలో ఉంటున్నాం. ఇక్కడ చలిలో, రోడ్లపై మా సోదరులు ఆందోళన చేస్తుంటే వారికి మద్దతు తెలిపేందుకు వచ్చాం."

- ముబీనా, దిల్లీ

మేం దేశ భక్తులం

"కొత్త చట్టాలపై నిరసనలను కేంద్రం పట్టించుకోకపోవడం దారుణం. ఒకట్రెండు సంఘటనలు చూపి రైతులపై దేశద్రోహుల ముద్ర వేయడం తగదు. పంజాబ్‌లో ప్రతి ఇంటి నుంచి సైనికులు ఉన్నారు. మేం దేశ భక్తులం."

- టింకూ సింగ్‌, పంజాబ్‌

ఇదీ చదవండి: తోమర్​ వ్యాఖ్యలపై మళ్లీ పవార్​ కౌంటర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.