సైనిక విజయాలను రాజకీయంగా వాడుకుంటున్నారని విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. గత ప్రభుత్వం సైన్యానికి స్వేచ్ఛనివ్వలేదని, తాము ఇచ్చామని స్పష్టం చేశారు.
కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఓ సమావేశంలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. విద్యావేత్తలు, మేధావులు, యువకులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 2008లో దేశంలో ఉగ్రదాడులు జరిగినప్పుడు మన్మోహన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
" సైన్యం చర్యలను ఎవరూ రాజకీయం చేయాలనుకోవట్లేదు. నేను కానీ ప్రధానమంత్రి కానీ ఎవరూ ఆ దిశగా ఆలోచనే చేయలేదు. కానీ రాజకీయ స్వేచ్ఛ గురించి మాట్లాడాం. మాకు నిఘా వర్గాల సమాచారం ఉన్నప్పుడు సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. తీవ్రతకు తగినట్టుగా చర్యలు తీసుకున్నాం. ఇవి చెప్పటం తప్పా? ఇది రాజకీయం చేయటం అవుతుందా? 2008లో ఏం జరిగింది? 2018లో ఏం జరిగిందో భేదాలు చూపించాం. ఇదీ తప్పా?"
-నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి
ఇదీ చూడండి: 'ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టించాం'