దేశ భద్రతను బలోపేతం చేయడానికి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించబోమని విపక్ష కాంగ్రెస్ ప్రకటించింది. సీడీఎస్‌గా జనరల్ బిపిన్ రావత్ నియామకంపై ఆ పార్టీ నేతలు అధీర్ రంజన్, మనీశ్ తివారీ విమర్శల వర్షం కురిపించిన తరుణంలో పార్టీ ఈ విధంగా స్పందించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
సీడీఎస్‌ను నియమించాలన్న కేంద్ర నిర్ణయం సరైనదా? కాదా అనే విషయం త్వరలోనే ప్రజలకు అర్థమవుతుందన్నారు కాంగ్రెస్ ప్రతినిధి సుస్మితా దేవ్. సీడీఎస్ పనితీరు చూడనంత వరకు ఆ అంశంపై స్పందించడం సరికాదన్నారు.
"సీడీఎస్ నిమాయకం కేంద్రం నిర్ణయమే. త్రివిధ దళాధిపతిగా రావత్ ఆయన బాధ్యతలను నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాం. దేశ భద్రతను బలోపేతం చేయడానికి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. కాంగ్రెస్ వ్యతిరేకించదు."
--- సుస్మితా దేవ్, కాంగ్రెస్ ప్రతినిధి.
అయితే సీడీఎస్ నియమాకం ఓ తప్పటడుగు అని ఆ పార్టీ నేతలు అధీర్ రంజన్, మనీశ్ చేసిన వ్యాఖ్యలపై సుస్మితా స్పందించడానికి నిరాకరించారు.
ఇదీ చూడండి- సీడీఎస్ నియామకం ఓ తప్పటడుగు: కాంగ్రెస్