రాజస్థాన్ కోటాలోని జేకే లాన్ ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారుల మరణాలపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉండాల్సిందని స్పష్టం చేశారు.
"107మంది శిశువులు ఆస్పత్రిలో మరణించారు. ఇది చాలా బాధాకరం. గుండెను పిండేసే ఘటన. ఈ విషయం తెలిసి యావత్ దేశం చలించిపోయింది. మా ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది. నిరుపేదలు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకంతో వస్తారు. అలాంటి వారు ఈ రోజు తమ బిడ్డలను కోల్పోతున్నారు. దీనికి మా ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి. ఈ శిశు మరణాలకు మా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది."
-సచిన్‌పైలట్, రాజస్థాన్ డిప్యూటీ సీఎం.
తొలుత బాధిత కుటుంటాలను పరామర్శించి అనంతరం ఆస్పత్రిని సందర్శించారు పైలట్. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఈ శిశు మరణాల పట్ల తీవ్ర కలత చెందినట్లు చెప్పుకొచ్చారు.
ఇదీ చూడండి : 107కు చేరిన 'కోటా' మరణాలు.. కేంద్ర బృందం నివేదిక