ETV Bharat / bharat

ఇంట్లో నీళ్లు ఖతం చేస్తున్న కరోనా! - corona in india

'కడుగుతూనే ఉండు కడుగు' అని వైద్యులు చెప్పగానే.. తెగ చేతులు కడిగేసుకుంటున్నారు భారతీయులు. ఫలితంగా నీటి వినియోగం విపరీతంగా పెరిగిందని కేంద్ర జల్‌శక్తి శాఖ అధ్యయనంలో తేలింది. కరోనా శుభ్రత పాటించే క్రమంలో నీళ్లు నిండుకుంటున్నాయని వెల్లడించింది.

water-usage-of-households-have-increased-during-covid-19-era
ఇంట్లో నీళ్లు ఖతం చేస్తున్న కరోనా!
author img

By

Published : Aug 2, 2020, 12:18 PM IST

దేశంలో కొవిడ్‌-19 ఉద్ధృతికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా విధించిన లాక్‌డౌన్‌ నాటి నుంచి ఇళ్లలో ప్రత్యేకంగా పట్టణాలు, నగరాల్లోని ఇళ్లలో నీటి వాడకం పెరిగిపోయింది. ఇళ్లకే పరిమితమైన ప్రజలు పదేపదే చేతులను శుభ్రం చేసుకోవడం, ఇంటిని క్రిమిరహితం చేసుకోవడమే ఇందుకు కారణం. కేంద్ర జల్​శక్తి శాఖ, జల సంరక్షణ కార్యకర్తలు చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఒక్కసారి చేతులను శుభ్రం చేసుకోవడానికి కనీసం రెండు లీటర్ల నీరు వాడుతున్నట్లు సర్వేలో తేలింది. ''కరోనా నుంచి కాపాడుకునేందుకు ప్రజలు తరచూ కనీసం 20 సెకన్ల నుంచి 30 సెకన్లు సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) సిఫార్సు చేసింది. ఇందుకు వినియోగించే నీటి పరిమాణం సుమారు 2 లీటర్లు ఉంటోంది. ఒక కుటుంబంలో నలుగురు లేక ఐదుగురు సభ్యులు ఉంటే.. రోజుకు కనీసం 70 లీటర్ల నీటిని అదనంగా వినియోగిస్తున్నారు'' అని జల్​శక్తి శాఖలోని ఓ అధికారి తెలిపారు.

''నగరాలు, పట్టణాల్లో జన సాంద్రత ఎక్కువగా ఉన్నందున అక్కడ నీటి వినియోగం ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాలవారికి కాలువలు, చెరువులు వంటి జలవనరులు ఉంటాయి. నగరవాసులకు మాత్రం కుళాయి, బోరు నీరే ఆధారం. అందువల్ల భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి. ఓ వైపు ముంబయిలోని అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోయినా.. చాలా ప్రాంతాలు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆగస్ట్‌ నెలలో కనీసం 20% నీటి సరఫరాను తగ్గించేందుకు బృహణ్‌ ముంబయి మునిసిపల్‌ కార్పొరేషన్‌ సిద్ధం అవుతోంది. మరోవైపు, ముంబయిలో కొవిడ్‌-19 కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందువల్ల ఇళ్లలో నీటి వినియోగం పెరగడం అనేది అనివార్యం'' అని వివరించారు.

స్మార్ట్‌ మీటర్లు బిగించాలి: బాలకృష్ణన్‌

నీటి వినియోగాన్ని పక్కగా లెక్కించడానికి స్మార్ట్‌ నీటి మీటర్లు బిగించాలని పర్యావరణ ఉద్యమకారుడు, జల సంరక్షణపై కృషిచేస్తున్న ఎన్‌జీవోతో కలిసి పనిచేస్తున్న ఎస్‌.బాలకృష్ణన్‌ చెప్పారు. ''లాక్‌డౌన్‌ సమయంలో ఎంత నీరు వినియోగం అవుతుందో పరిశీలించేందుకు ప్రజలు, ప్రభుత్వానికి పరిమిత వనరులే ఉన్నాయి. మరోవైపు, భారత్‌లో రోజురోజుకు నీటి వినియోగం పెరుగుతోంది. ప్రస్తుతం మనం ఎంత నీరు వినియోగిస్తున్నామో దానికి రెండింతల నీరు 2030 నాటికి అవసరం అవుతుందని అంచనాలు ఉన్నాయి. అందువల్ల ప్రతి ఇంటికి స్మార్ట్‌ నీటి మీటర్‌ బిగించాలి. దానివల్ల వినియోగం తీరుతెన్నులను ఎక్కడో ప్రభుత్వ కార్యాలయం నుంచే పరిశీలించగలం. ఒకవేళ ఏదైనా ఇంట్లో నీటి వినియోగం విపరీతంగా ఉంటే వారికి అవగాహన కల్పించవచ్చు’’ అని ఆయన ఈటీవీ-భారత్‌తో అన్నారు.

ఇదీ చదవండి: కరోనాతో యూపీ మంత్రి కమలా రాణి కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.