ఆర్టికల్ 370 అమలు, కరోనా కారణంగా మూతబడిన జమ్ముకశ్మీర్ పర్యటక రంగం మళ్లీ ఊపందుకుంది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పర్యటక కేంద్రమైన పహల్గామ్కు పర్యటకుల తాకిడి మళ్లీ మొదలైంది. ఈ జనవరిలో ఇక్కడికి వచ్చే సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
జమ్ముకశ్మీర్‌లోని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ..ఇక్కడి మంచు దృశ్యాలను తిలకిస్తున్నారు పర్యటకులు. మంచుతో కప్పిఉన్న లోయలు పర్యటకులను ఆకర్షింపజేస్తున్నాయి. పర్యటకం మీదే ఆధారపడ్డ ఇక్కడి స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:ఆ గుడిలో మహాత్ముడికి నిత్యపూజలు!