వీడియో షేరింగ్ మొబైల్ యాప్ టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఎత్తివేసింది మద్రాస్ హైకోర్టు. అశ్లీలతను పెంపొందించే అభ్యంతరకరమైన వీడియోలు అప్లోడ్ కాకుండా, షేర్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.
సమాజంపై దుష్ప్రభావాన్ని చూపుతోందన్న కారణంగా ఈనెల 3న టిక్‌టాక్‌పై మద్రాస్ హైకోర్టులోని మధురై ధర్మాసనం నిషేధం విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది యాప్‌ను నిర్వహిస్తోన్న బైట్ డాన్స్ సంస్థ.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నెల 22న ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. టిక్‌టాక్‌పై తుది నిర్ణయాన్ని ఈనెల 24 లోగా తేల్చాలని మద్రాస్ హైకోర్టును ఆదేశించింది.
సుప్రీం ఆదేశాలనుసారం నేడు టిక్‌టాక్ వ్యాజ్యంపై విచారణ జరిపింది మద్రాస్ హైకోర్టులోని మధురై ధర్మాసనం. వీడియో షేరింగ్ యాప్‌పై తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పునిచ్చింది.