అసోం చిరాంగ్ జిల్లా ఉడాల్గురి గ్రామంలో సరైన రవాణా వ్యవస్థ లేక ఓ నిండు గర్భిణి తీవ్ర ఇబ్బందులకు గురైంది. ప్రసవానికి ఆసుపత్రికి చేర్చేందుకు ఇద్దరు వ్యక్తులు ఆమెను మోసుకెళ్లాల్సి వచ్చింది.
ఆ మహిళకు పురిటి నొప్పులు మొదలవగానే కుటుంబ సభ్యులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. సిబ్బంది సరిగా స్పందించలేదు. అందుబాటులో మరే వాహనం లేదు. ఆ సమయంలో వర్షం కురవడం సమస్యను మరింత తీవ్రం చేసింది.
చేసేది లేక... ఓ మంచాన్నే స్ట్రెచర్‌గా మార్చారు కుటుంబ సభ్యులు. మంచానికి పాలిథిన్ కవర్ చుట్టి, ఒక పొడవాటి కర్రకు కట్టారు. ఆ కర్రను భుజాలపై మోస్తూ 5 కిలోమీటర్లు నడిచారు. ఆస్పత్రికి చేరకముందే ఆ గర్భిణి ప్రసవించింది.