కొన్ని చోట్ల మినహా ఐదో దశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. పుల్వామాలో గ్రనేడ్ దాడి, బిహార్‌లో ఈవీఎం ధ్వంసం, బంగాల్లో తృణమూల్, భాజపా కార్యకర్తల ఘర్షణ వంటి చిన్న చిన్న ఘటనలు చోటుచేసుకున్నాయి.
11 గంటల వరకు పోలింగ్ శాతాలను ప్రకటించింది ఎన్నికల సంఘం. ఓటింగ్ శాతంలో బంగాల్ దూసుకెళ్తోంది. మొదటిస్థానంలో ఉంది. అత్యల్ప ఓటింగ్ నమోదుతో జమ్ముకశ్మీర్ చివర్లో నిలిచింది.
రాష్ట్రం | పోలింగ్ శాతం |
పశ్చిమ్ బంగ | 33.16 |
ఝార్ఖండ్ | 29.49 |
రాజస్థాన్ | 29.32 |
మధ్యప్రదేశ్ | 25.68 |
ఉత్తర్‌ప్రదేశ్ | 22.46 |
బిహార్ | 20.74 |
జమ్ముకశ్మీర్ | 6.09 |
-
Voting underway in 51* parliamentary constituencies in #Phase5 of ongoing #LokSabhaElections2019
— PIB India (@PIB_India) May 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Voter turnout at 11 am pic.twitter.com/Xphp6evtOH
">Voting underway in 51* parliamentary constituencies in #Phase5 of ongoing #LokSabhaElections2019
— PIB India (@PIB_India) May 6, 2019
Voter turnout at 11 am pic.twitter.com/Xphp6evtOHVoting underway in 51* parliamentary constituencies in #Phase5 of ongoing #LokSabhaElections2019
— PIB India (@PIB_India) May 6, 2019
Voter turnout at 11 am pic.twitter.com/Xphp6evtOH
పుల్వామాలోని స్థానిక పోలింగ్ కేంద్రంపై ముష్కరుల గ్రనేడ్ దాడితో ఓటర్లు ఆందోళనకు గురయ్యారు. అయితే.. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పటిష్ఠ చర్యలు చేపట్టింది.
బంగాల్లో టీఎంసీ, భాజపా కార్యకర్తల మధ్య చిన్న ఘర్షణ జరిగింది. బిహార్ ఛప్రాలోని పోలింగ్ కేంద్రంలో ఓ వ్యక్తి ఈవీఎం యంత్రాన్ని ధ్వంసం చేశాడు. పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.
ఓటర్లకు వినూత్నంగా స్వాగతం...
రాజస్థాన్ హనుమాన్‌గఢ్‌లోని ఓ మోడల్ పోలింగ్ బూత్‌లో మహిళా ఓటర్లకు వినూత్న స్వాగతం పలుకుతున్నారు సిబ్బంది. నుదుట బొట్టు.. మెడలో పూల దండలు వేసి ఓటు వేయడానికి ఆహ్వానిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు.