ETV Bharat / bharat

'పాసవాన్​ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు' - ram vilas paswan passes away

కేంద్ర మంత్రి, ఎల్​జేపీ వ్యవస్థాపకుడు రామ్​విలాస్​ పాసవాన్​ మృతి పట్ల ప్రముఖ నేతలు విచారం వ్యక్తం చేశారు. దేశం దూరదృష్టి గల నాయకుడిని కోల్పోయిందని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ తెలిపారు. పాసవాన్​ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

paswan
పాసవాన్​
author img

By

Published : Oct 8, 2020, 11:00 PM IST

కేంద్ర మంత్రి రామ్​విలాస్​ పాసవాన్​ మృతి పట్ల రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ సంతాపం వ్యక్తం చేశారు. పాసవాన్​ అణగారిన వర్గాల తరఫున పోరాడారని కీర్తించారు.

paswan death
రాష్ట్రపతి ట్వీట్

"కేంద్ర మంత్రి రామ్​విలాస పాసవాన్​ మరణంతో దేశం.. దూరదృష్టి గల నాయకుడిని కోల్పోయింది. ఆయన చాలా చురుకైన నేత. దీర్ఘకాలం పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు. అణగారిన వర్గాల గొంతుకగా ఉన్నారు. వారికోసం పోరాడారు.

యువతలో ఆయన ఓ సోషలిస్ట్ ఫైర్​బ్రాండ్. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో జయప్రకాష్ నారాయణ్ వంటి మహానేతల అడుగుజాడల్లో నడిచారు. ప్రజలకు అండగా ఉన్నారు. వారి సంక్షేమం కోసం కృషి చేశారు. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు సంతాపాన్ని తెలియజేస్తున్నా."

- రామ్​నాథ్​ కోవింద్​, రాష్ట్రపతి

దేశానికి తీరని లోటు..

పాసవాన్​ మరణం దేశానికి తీరని లోటు అని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు.

paswan death
ప్రధాని మోదీ ట్వీట్

"పాసవాన్​ మరణవార్త విని దిగ్భ్రాంతి చెందా. దేశ రాజకీయాల్లో ఆయన స్థానాన్ని ఎప్పటికీ పూడ్చలేం. ఆయన మృతి నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. స్నేహితుడు, విలువైన సహచరుడు, పేద ప్రజలు ఉన్నతంగా బతకాలని ఆశించి కృషి చేసిన వ్యక్తిని నేను కోల్పోయాను.

పాసవాన్​ అత్యుత్తమ పార్లమెంటు సభ్యుడు, మంత్రి. అనేక విధాన రూపకల్పనల్లో భాగస్వామ్యం పంచుకున్నారు. అత్యయిక స్థితి సమయంలో ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా నిలబడ్డారు."

- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

నిటారైన వ్యక్తి: నితీశ్

రామ్​విలాస్ పాసవాన్​ మృతి పట్ల బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్​ విచారం వ్యక్తం చేశారు. భారత రాజకీయాల్లో పాసవాన్​ నిటారైన వ్యక్తి అని కీర్తించారు నితీశ్. "పదునైన వక్త, బహుళ ప్రజాదరణ పొందిన నాయకుడు, సమర్థుడైన కార్యశీలి, స్నేహపూర్వక వ్యక్తిత్వం ఆయనది" అని అన్నారు.

paswan death
నితీశ్ ట్వీట్

కలిసి పనిచేశాం: తేజస్వీ

పాసవాన్​ కుటుంబానికి ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్​ సంతాపం ప్రకటించారు. అత్యంత కీలకమైన సమయంలో రామ్​విలాస్.. ఆయన కుమారుడు చిరాగ్​ పాసవాన్​కు దూరమయ్యారని అభిప్రాయపడ్డారు. పాసవాన్​తోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించానని గుర్తుచేసుకున్నారు యాదవ్​. 2010లో ఎల్​జేపీ, ఆర్​జేడీ కూటమిగా ఉన్నప్పుడు పాసవాన్​తో కలిసి ఎన్నో ప్రచార సభల్లో పాల్గొన్నట్టు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: పోలీసు అధికారి నుంచి కేంద్ర మంత్రి వరకు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.